నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)ని బలోపితం చేసేందుకు అన్ని జిల్లాల్లో సంస్థ గత బూత్ కమిటీల ఇన్చార్జిలను నియమించడం జరుగుతుందని ఆ పార్టీ జిల్లా ఇంచార్జ్ ప్రేమేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పార్టీ చేపట్టిన సభ్యత్వానికి మంచి ఆదరణ లభించిందని తెలిపారు. బూత్ కమిటీలను ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి బిజెపి నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజు కుమార్ రెడ్డి, అయినవారి భూమయ్య, రావుల రామనాథ్, సాదం అరవింద్, తదితరులు పాల్గొన్నారు.