calender_icon.png 28 December, 2024 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అండగా ఉందాం

25-06-2024 12:05:00 AM

ఏ ప్రాణికైనా బతకడానికి ఆహారం అవసరం. దీన్ని తీర్చేది వ్యవసాయం చేసే రైతులు. రైతు విద్యావంతుడు కానప్పటికీ సంస్కారవంతుడు. తాను, తనతోపాటు అందరూ అనే భావంతో జీవిస్తాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా తోటివారి కష్టాల్లో పాలుపంచుకోవడానికి ముందుంటాడు. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి మంచి గృహం లేకున్నా ముఖంలో దిగులు కనబడనీయడు. హాలికుడు కనుక సాత్విక భావాలతో ‘బతుకు బతికించు’ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడు. రైతే దేశానికి వెన్నెముక అన్న సత్యాన్ని మరవకూడదు. ‘జాతీయ రైతు దినోత్సవం’ చౌదరి చరణ్ సింగ్ (భారతదేశ ఐదవ ప్రధానమంత్రి) పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటాం. రైతు కష్ట ఫలితమే దేశ సౌభాగ్యం. అందుకే, రైతులకు అండగా నిలుద్దాం.

 -దేవులపల్లి రమేశ్, నంగునూర్