- పలు పట్టణాల్లో అంతర్జాతీయ పులుల దినోత్సవం
- బేస్‌క్యాంపు ప్రొటెక్షన్ వాచర్‌కు ఉత్తమ అవార్డు
నాగర్‌కర్నూల్/కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 29 (విజయక్రాంతి): నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో సోమవారం అంతర్జాతీయ టైగర్స్ డేను ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ అధి కారులు బైక్ ర్యాలీ నిర్వహించి, ప్రజలకు పు లుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. బెస్ట్ టైగర్ రిజర్వ్‌డ్ ప్రాంతంగా గుర్తించబడిన అమ్రాబాద్ దేవరకొండ రేంజ్ పరిధిలో పనిచేస్తున్న బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్ వెంకటయ్య ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. సోమవారం ఢిల్లీ లో కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో కేంద్ర పర్యావరణ, పరిరక్షణ, అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చేదుల మీదుగా అవార్డును అందుకున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. డిప్యూటి రేంజ్ అధికారి యోగేష్ పాల్గొన్నారు.