calender_icon.png 5 January, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుదాం

02-01-2025 07:28:38 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాను 2025 సంవత్సరంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి రాష్ట్రంలోని మంచి జిల్లా పేరుగా తెచ్చుకుందామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ ను కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కు పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు గోవిందరావు, విజయలక్ష్మి, అంజి ప్రసాద్, శ్రీనివాస్, కిరణ్ కుమార్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్, జీవరత్నం, అశోక్ కుమార్, శంకరయ్య, స్రవంతి, రామారావు, సందీప్ కుమార్, అంబాజీ నాయక్, కిషన్ తదితరులు ఉన్నారు.