calender_icon.png 30 October, 2024 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాయు కాలుష్యాన్ని తగ్గిద్దాం

29-10-2024 12:00:00 AM

కొత్త వాహనాలకంటే పాత వాహనాలు ఎక్కువ వాయు కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. ఇవి మరింత కఠినమైన ఉద్గార నిబంధనలకు లోబడి ఉండాలి.  పాత ట్రక్కుల నుంచి వచ్చే మొత్తం ఉద్గారాలు  కొత్త ట్రక్కులకంటే 6 రెట్లు ఎక్కువ. పాత కారునుంచి వచ్చే మొత్తం ఉద్గారాలు  కొత్త కార్లకంటే 2.6 రెట్లు ఎక్కువ. వాహనాలకు క్రమం తప్పకుండా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించడం వల్ల కాలుష్యకారక వాహనాలను గుర్తించవచ్చు.

మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 56 ప్రకారం, నిర్ణీత అథారిటీ లేదా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా జారీ అయిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను కలిగి ఉంటే తప్ప, రవాణా వాహనం చెల్లుబాటు కాదు. మోటారు వాహనా ల చట్టం 1988లోని సెక్షన్ 39 ప్రకారం, వాహనాన్ని రిజిస్టర్ చేయకపోతే నడపడానికి అనుమతి లేదు. రవాణాయేతర వాహనాల కోసం రిజిస్ట్రేషన్ సర్టిఫికే ట్ పునరుద్ధరణ సమయంలో ఫిట్‌నెస్ పరీక్ష ఆధారంగా ఆ సర్టిఫికెట్ పొందడం అవసరం. 

‘ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్’లలో పరీక్షలు

‘ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్’లో అనేది మానవుల జోక్యం లేకుండా వాహనాల ఫిట్‌నెస్‌ను పరీక్షించే సదుపాయం ఉం టుంది. పౌరులు తమ వాహనాలను దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా  ‘ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్’లలో పరీక్షించి సంబంధిత అధికారుల నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఈ సర్టిఫికెట్  దేశమంతటా చెల్లుబాటు అవుతుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ప్రకారం ‘ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్’ వద్ద వాహన ఫిట్‌నెస్ పరీక్షకోసం ప్రభుత్వం నియమాలను విడుదల చేసింది.

23 సెప్టెంబర్ 2021, దాని సవరణలు జీఎస్‌ఆర్ 797 (ఈ), జీఎస్‌ఆర్ 195 (ఈ) ప్రకారం, అక్టోబర్ 2024 నుంచి అన్ని వాణిజ్య వాహ నాలు తమ ఫిట్‌నెస్ పరీక్షను ‘ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్’ నుంచి మాత్రమే పూర్తి చేయడం తప్పనిసరి అయింది. ఈ పరీక్ష లు సమాచార ప్రయోజనం కోసం మాత్ర మే,  వాహన ఆరోగ్య సమాచారాన్ని అందిస్తాయి. సమాచార పరీక్షలో విఫలమైతే వాహనం ఫిట్‌నెస్ స్థితిని ప్రభావితం చేయదు. ఫెయిల్యూర్ పరీక్షల తర్వాత స్థితి అనర్హమవుతుంది. వాహనం సాఫీగా నడవడానికి కొన్ని రకాల పరీక్షలు ముఖ్యం.

ఒక వాహనం ఈ పరీక్షలలో దేనినైనా విఫలమైతే, అది అన్‌ఫిట్‌గా ప్రకటితమవు తుంది. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరణ జరగదు. తిరిగి పరీక్ష సమయంలో అన్ని విఫలమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించే వరకు వాహనం రోడ్లపై తిరగడానికి అనుమతి ఉండదన్నమాట.

రోడ్డు ప్రమాదాల నివారణ

ఈ రకమైన పరీక్షలు రోడ్డు వినియోగదారులందరికీ రహదారి భద్రతలో కీలకం. వీటిల్లో ఏదైనా వాహనం విఫలమైతే, అది అన్‌ఫిట్ అవుతుంది. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరించబడదు. సదరు వాహనం రోడ్డుపై నడిచే అవకాశాన్ని కోల్పోతుంది. వాహనం మునుపటి పరీక్ష తేదీనుంచి 180 రోజులలోపు పరీక్షించబడకపోతే (పరీక్ష తేదీని మినహాయించి) వాహనం ఎండ్- ఆఫ్- లైఫ్ వెహికల్‌గా ప్రకటితమవుతుంది. వాహనంలో ఈఎల్‌వీ (ఎండ్ ఆఫ్ లైప్ వెహికిల్స్) ఫ్లాగ్ చేయబడుతుంది.

ఆటోమేటెడ్ టెస్టింగ్ విధానం వాహనాన్ని ఆపడానికి అవసరమైన బ్రేకింగ్ ఫోర్స్‌ను కొలుస్తుంది. వాహనం  ఫ్రంట్ యాక్సిల్ రోలర్ బ్రేక్ టెస్టర్‌పై ఉంచబడింది. రోలర్లు వాహనం చక్రాన్ని ముందే నిర్వచించిన వేగంతో తిప్పుతాయి. రోలర్లను ఆపడానికి బ్రేకులు వర్తించబడతాయి. చక్రాన్ని ఆపడానికి అవసరమైన గరిష్ట బ్రేక్ ఫోర్స్‌ను దీనిద్వారా కొలుస్తారు. 

సరైన నిర్వహణ లేని వాహనాలు సమాజానికి, పర్యావరణ భద్రతకు హానికరం. బ్రేకులు, ఎగ్జాస్ట్, స్టీరింగ్ వంటి కీలకమైన వాహన భాగాల సరికాని పనితీరు రోడ్డు ప్రమాదాల అవకాశాలను పెంచుతుంది. అలాంటి వాహనాలవల్ల ప్రయాణికులు, రహదారి వినియోగదారులకు గాయాలు కలిగించవచ్చు. కనుక, వాహన యజమానులు తమ వాహనాలను క్రమం తప్పక నాణ్యతను నిర్వహిం చేలా, తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకునేలా బాధ్యతతో మెలగాలి.

వాహ నాల సాధారణ ఫిట్‌నెస్ పరీక్షలు అన్ని భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చేయడంలో సహాయపడతాయి. సెంట్రల్ మోటర్ వెహిక ల్స్ రూల్స్ 1989లోని రూల్  ప్రకా రం, వాహన యజమానులు వాహన ఫిట్‌నెస్‌కు సంబంధించి నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.  వాహనం ఫిట్‌నె స్ పరీక్షను నిర్వహణ రుసుము, అధీకృత పరీక్ష స్టేషన్‌కు చెల్లించబడుతుంది. 

వాహనాల కోసం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మంజూ రు లేదా పునరుద్ధరణ కోసం రుసుము ఫిట్‌నెస్ పరీక్ష తర్వాత సదరు సర్టిఫికెట్ జారీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫిట్‌నెస్ పునరుద్ధరణలో జాప్యం జరిగితే జరిమానా తప్పదు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత ఆలస్య మైన ప్రతిరోజుకు ఇంత చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

వాహన యజమానులదే బాధ్యత

కొన్ని రాష్ట్రాల్లో, పరీక్షలు నిర్వహించడం లేదా విలువ జోడించిన సేవలను అందించడం కోసం ఉపయోగించే ఆటోమేషన్ టెక్నాలజీ ఖర్చునూ అదనపు రుసుము పేరుతో వసూలు చేస్తారు. ఏమైనా, గడువు తీరిన వాహనాలు కాలష్యకారకంగా లేకుండా ఉంటేనే చట్టబ ద్ధమైన అనుమతి  లభిస్తుందన్న సంగతిని అందరూ తెలుసుకోవాలి. ఇందుకోసం వాహన యజమానులు సహకరించవలసి ఉంటుంది. అప్పుడే వాయు కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుంది. 

- డా. ముచ్చుకోట సురేష్‌బాబు