calender_icon.png 21 April, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని మనమే పరిరక్షించుకుందాం

11-04-2025 12:35:22 AM

సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ  నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

సిద్ధిపేట, ఏప్రిల్ 10 (విజయక్రాంతి):రాజ్యాంగాన్ని ప్రజలందరం కలిసి పరిరక్షిం చుకుందమని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో గురువారం  జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర 31, 32, 43వ వార్డులలో కౌన్సిలర్ పయ్యావుల ఎల్లం, పూర్ణిమ, వహబ్, బైరి సాయిల  ఆధ్వర్యంలో నిర్వహించారు.

పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ లు పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరి బాగోగులు కోసం రాజ్యాం గాన్ని రచించారని, అలాంటి మహోన్నతమై న వ్యక్తి రాజ్యాంగం రాస్తే ఆ వ్యక్తిని అవమానించేలా బిజెపి ప్రభుత్వం అవమాని స్తుందన్నారు.

అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రజలు త్వరలోనే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గంప మహేందర్,  బొమ్మల యాద గిరి, ముద్దమ్ లక్ష్మి, పూజల గోపికృష్ణ, మార్క సతీష్ గౌడ్, కరీముద్దీన్, వహీద్ ఖాన్,  నర్సింగ్ యాదవ్, గయాజుద్దీన్, చాంద్, సంతోషా, అజ్మాత్, అర్షాద్, నజ్జూ, రేణుకా, మార్క పద్మ, సలీం, స్రవంతి, రజిని, సన, ఇమ్రాన్ అలీ, రాకేష్, సాయి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.