calender_icon.png 26 October, 2024 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కాకతీయ కళాసంపదను కాపాడుతాం

05-08-2024 02:06:14 AM

మంత్రి కొండా సురేఖ

హనుమకొండ, ఆగస్టు 4 (విజయక్రాంతి): కాకతీయ కళా సంపదను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం వరంగల్‌లోని  రాతి  కోట ఉత్తర ద్వారం,  ఏకశిల మైదానం,  అగర్త చెరువు మత్తడి,  చెరువు,  లక్ష్మీపత్రి గండి, త్రికుటాలయం, పురావస్తు శాఖ మ్యూజియం,  శంభుని గుడి  ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. ఏకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయడానికి సంబంధిత అధికారులతో మాట్లాడారు.

వరంగల్ రాతికోట ద్వారం వద్ద నిలిచిన వర్షపు నీటిని చూసి నీరు ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అగర్తల చెరువును పరిశీలించి చెరువు సుందరీకరణ, బోటింగ్, ఫిషింగ్, లైటింగ్ వంటి పలు ఏర్పాట్లకు సమగ్ర ప్రణాళికలు చేయాలని మంత్రి సూచించారు. ఖిలా వరంగల్ ప్రాంతాన్ని ఎకో, టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని, అందుకు ప్రణాళికలు రచించాలని సంబంధిత యంత్రాంగాన్ని ఆదేశించారు.  

కాకతీయుల నాటి 20 గుళ్లను పునరుద్ధరించి పర్యాటకానికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పురావస్తు శాఖ మ్యూజియం పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశింరు. సెప్టెంబరు 9న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. మంత్రి వెంట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, జిల్లా, మండలాల నాయకులు, అధికారులు ఉన్నారు.