calender_icon.png 4 February, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారీ వ్యవస్థను రూపుమాపుతాం

03-02-2025 11:03:51 PM

రైతు బజార్​లలో రైతులకు అధిక ప్రాధాన్యత

రైతులకు వినియోగదారులకు నష్టం కలగనివ్వం

గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్  చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి

అబ్దుల్లాపూర్​మెట్​: రైతు బజార్​లలో దళారీ వ్యవస్థను రూపుమాపుతామని గడ్డిఅన్నారం మార్కెట్​ కమిటీ చైర్మన్​ చిలుక మధుసూదన్​రెడ్డి అన్నారు. పాలకవర్గ సభ్యులు, అధికారులతో కలిసి కొత్తపేట రైతు బజార్​ను సందర్శించారు. రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లలో దళారీ వ్యవస్థకు ప్రమేయం లేదని.. స్టాల్స్ ఉన్న రైతులు పండించిన పంటను నేరుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా  అధికారులు సూచించిన ధరలకు వినియోగదారులకు అమ్ముకోవచ్చన్నారు.       

ఈ సందర్భంగా చిలుక మధుసూదన్​రెడ్డి మాట్లాడుతూ... రైతు బజార్​లలో దళారీ వ్యవస్థను రూపుమాపుతామన్నారు. కొత్తపేట రైతు బజార్​లో రైతులకు నష్టం కలిగేలా సాయంత్రం వేళల్లో కొంత మంది దళారులు అమ్ముతున్న విషయాన్ని రైతులు తమ దృష్టికి తెచ్చరని తెలిపారు. అట్టి దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. మార్కెట్​లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత అధికారులదేన్నారు. రైతులకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మనదే అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్​ భాస్కరాచారి, డైరెక్టర్లు బండి మధుసూదన్ రావు, పన్యాల జైపాల్ రెడ్డి, మెగావత్ గణేష్ నాయక్, రఘుపతి రెడ్డి, అంజయ్య.. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్​. శ్రీనివాస్, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్రవంతి,  సూపర్ వైజర్లు,  ఇతర సిబ్బంది తదితరులున్నారు.