calender_icon.png 10 March, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామ్రేడ్ చంద్రబోస్ స్ఫూర్తితో ఉద్యమిద్దాం

10-03-2025 01:01:20 AM

సూర్యాపేట, మార్చి 9: కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ స్పూర్తితో ఉద్యమిద్దామని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ లో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ర్ట కార్యదర్శి అమరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) 9వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

దేశంలోని పాలకవర్గాలు ప్రజల సంక్షేమాన్ని  విస్మరించారని,ప్రజల అవసరాలు, సమస్యలు తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. కార్యక్రమంలో పిఓడబ్ల్యు రాష్ర్ట అధ్యక్షులు డి.స్వరూప, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిడిఎస్యు రాష్ర్ట ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, టియుసీఐ జిల్లా నాయకులు చిత్తలూరి లింగయ్య, బహుజన మహాసభ నాయకులు వెంకట్ యాదవ్, రాయిల రవి కుమార్, కట్ట రమేష్, హుస్సేన్ లు పాల్గొన్నారు.