calender_icon.png 24 October, 2024 | 3:58 PM

నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం

06-08-2024 05:04:15 AM

స్వచ్ఛదనం-పచ్చదనం ర్యాలీలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను ఆహ్లాదకర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం జూబ్లీహిల్స్ సర్కిల్ ఎన్‌బీటీ నగర్‌లో జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, అధికారులతో కలిసి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. అదేవి ధంగా కాచిగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛద నంహా కార్యక్రమంలో అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. 

యాదాద్రి భువనగిరి: స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా యాదగిరి గుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. భువనగిరిలోని ప్రగతి నగర్‌లో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతు కే జండగే మొక్కలు నాటి వనమహోత్సవంపై అవగాహన కల్పించారు. 

మెదక్: స్వచ్ఛదనం భాగంగా మెదక్ జిల్లాలోని టేక్మాల్, బొడ్మట్‌పల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమా లకు కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాలీలో నిర్వహించారు.  

గజ్వేల్: గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచడానికి, ఆరోగ్యకర వాతావర ణం నెలకొల్పడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన స్వచ్ఛత ర్యాలీలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మర్కూక్ మండలం పాములపర్తిలో నిర్వహించినన ర్యాలీలో కలెక్టర్ మనుచౌదరి పాల్గొని మాట్లాడారు.

పటాన్‌చెరు: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎంపీపీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఇబ్రహీంపట్నం: తుర్కయంజాల్ అంబేద్కర్ చౌరస్తా నుంచి మాసబ్ చెరువు బుద్ద విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.