calender_icon.png 24 January, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్ ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం..

23-01-2025 11:16:02 PM

ఎమ్మెల్యే శంకర్...

ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని సమస్యలు అనేక సంవత్సరాల నుంచి పరిష్కారం కాకా పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వార్డుల వారీగా గుర్తించి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. గురువారం మహాలక్ష్మి వాడలో రోడ్ల మరమ్మత్తులకు రూ. 85 లక్షలతో నిర్మాణం, రూ. 30 లక్షల తో సైడ్ డ్రెన్, కోటి రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం, నీటి అవసరాల కొరకు 6 లక్షల కెపాసిటీ గల నీటి ట్యాంక్ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పట్టణంలోని పలు వార్డులలో 11 కోట్ల నిధులతో పలు పనులు ప్రారంభించామన్నారు. అమృత్ పథకంలో భాగంగా రూ.300 కోట్ల రూపాయలుతో పట్టణంలో పైప్లైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మాణం చేపట్టాడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.