calender_icon.png 12 January, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామిక స్ఫూర్తిని కొనసాగిద్దాం!

15-09-2024 12:00:00 AM

ప్రాచీన మానవుడు వేట సమయంలో క్రూరమృగాల నుంచి తనకు తాను రక్షించుకోవడానికి సమూహాలుగా తిరిగేవాడు. ఈ సమూహంలో ఉన్న  వారికి దిశా నిర్దేశం చేయ డానికి బలవంతుడైన పెద్ద ఉండేవాడు. అప్పట్లో పేరు పెట్టకపోయినా ఆ పెద్దనే నాయకుడు. కాలక్రమేణా ఇటువంటి సమూహాలన్నీ గ్రామాలుగా, గ్రామాలన్నీ కలిసి రాజ్యంగా ఏర్పడ్డాయి. ఇటువంటి రాజ్యాలు ఎన్నో ఒక దాని పక్కన ఇంకొకటి ఏర్పడ్డాక ఒక రాజ్యంలోని ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న సంపద ని ఇంకో రాజ్యంలోని ప్రజలు దోచుకోకుండా ప్రతి రాజ్యానికి ఒక నాయకుడు అవసరమయ్యాడు.

ఆ నాయకుడి ప్రథమ కర్తవ్యం ఆ రాజ్యంలోని ప్రజలను రక్షించ డం. అయితే, రాన్రాను ఈ నాయకుడి బాధ్యతలు ఎక్కువయ్యాయి. అప్పట్లో ఎవరు బలవంతుడైతే అతడే నాయకుడిగా చలామణి అయ్యేవాడు. కాలక్రమంలో అతడు నిరంకుశుడుగా తయారయ్యాడు. అతనే రాచరిక వ్యవస్థలో రాజుగా మారా డు. రాచరికంలో రాజు దైవాంశ సంభూతుడుగా ప్రవర్తించేవాడు. తాను చెప్పిందే వేదం. తన మాట వినని వారికి మరణమే శరణ్యం. అలాంటి వారి కుటుంబానికి చెందిన వారసుడే తిరిగి రాజు అయ్యేవాడు. ప్రజలకు స్వేచ్చ, స్వాతంత్య్రాలు ఉండేవి కావు. అలాగే, రాజుని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదు. 

జవాబుదారీ వ్యవస్థగా నిలవాలి

అటువంటి కాలంలో ప్రజాస్వామ్య భావన మొట్టమొదటిసారిగా క్రీ.పూ. 508లో పురాతన ఏథెన్స్‌లో ఉద్భవించిందని చరిత్రకారులు చెప్తారు. అరిస్టాటిల్ ప్రకారం ప్రజాస్వామ్యం అంతర్గత నియ మం స్వేచ్ఛ. కేవలం ప్రజాస్వామ్యం వల్లనే పౌరులు స్వేచ్ఛను పొందుతారు. స్వేచ్ఛ కోసం ప్రజాస్వామ్యం ఉన్నదని నిర్ధారించారు. ప్రజాస్వామ్యం (డెమోక్రసీ) అనే పదం గ్రీకు పదాలు డెమోస్ (ప్రజలు), క్రాటోస్ (పాలన) నుంచి ఉద్భవించింది.

ముఖ్యంగా ‘ప్రజా పాలన’ అని అర్థం. ఇది ప్రభుత్వ వ్యవస్థ. ఇక్కడ పౌరులు నేరుగా అధికారాన్ని వినియోగించుకుంటారు లేదా పాలక మండలిని ఏర్పాటు చేయడానికి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రభు త్వం పౌరులకు జవాబుదారీగా ఉండే వ్యవస్థగా ప్రజాస్వామ్యం నిలుస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో, పౌరులు తమ తరఫున చట్టాలు, విధానాలను రూపొందించడానికి ప్రతినిధులను ఎన్నుకుంటారు.

రాజ్యాంగ ప్రజాస్వామ్యం అనే ది రాజ్యాంగం ద్వారా నియంత్రితమయ్యే ప్రజాస్వామిక ప్రభుత్వం. మానిటరీ ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యానికి ఆధుని క రూపం. ఇక్కడ వివిధ రకాలైన వాచ్‌డాగ్ బాడీలు, ఏజెన్సీలు అధికార సాధనను పర్యవేక్షిస్తూ, ప్రభావితం చేస్తాయి. ఈ మానిటర్లు ప్రభుత్వేతర సంస్థలు, స్వతంత్ర మీడియా, పబ్లిక్ ఇంటెగ్రిటీ కమిషన్లు, ఎన్నికైన ప్రతినిధుల చర్యలపై నిఘా ఉంచే అనేక ఇతర సంస్థలు కావచ్చు. అయితే, ఆధునిక యుగంలో ప్రజాస్వామ్యం కలిగి న దేశాలు చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి చెందిన మౌలిక భావనగా ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకునే లేదా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

కొన్ని దేశాలలో పౌరులు తమ అధ్యక్షుడు లేదా పరో క్షంగా ప్రధానమంత్రిని, మరి కొన్ని దేశాలలో ప్రత్యక్షంగా తమ ఓటుహక్కు ద్వారా ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్యం అనే వాహనానికి ప్రజలే ఇంధనం. నాయకుడే సారథి. ఇది చక్కగా నడవాలంటే ప్రధానమైన చక్రాలుగా న్యాయ, శాసన వ్యవస్థలు పనిచేస్తాయి. ఈ వాహనం సాఫీగా ప్రయాణం చేయాలంటే అన్ని వ్యవస్థలూ బాగా పని చేయాలి.

బాధ్యతలనూ గుర్తిద్దాం

ప్రజాస్వామ్యంలో ప్రజలు హక్కులకోసం పోరాడే ముందు తమ బాధ్యత లను ఎంతవరకు నిర్వర్తిస్తున్నామో ఆలోచించాలి. హక్కులు, బాధ్యతలు నాణేనికి బొమ్మ బొరుసు వంటివి. ప్రాథమిక బాధ్యతలు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రధానమైనవి. ‘ఈ దేశం నాకేం ఇచ్చిం ది?’ అనేది కాదు, ‘నేను ఈ దేశానికి ఏం చేశాను’ అని ప్రశ్నించుకోవాలి. మన బాధ్యతలను మనం తెలుసుకుంటే మొత్తం సామాజిక వ్యవస్థలోని లోపాలను మార్చగల శక్తి మనకు సమకూరుతుంది. మన బాధ్యతను తెలుసుకోవడం అంటే మనల్ని మనం సంస్కరించుకోవటమే.

తొలి బాధ్యతగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు అవ్వాలి. వీరందరూ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకు న్నప్పుడే ప్రజాస్వామ్యంలో తొలి అంకం ప్రారంభమవుతుంది. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజలకు మేలు చేసే నాయకుడికి ఓటు వెయ్యాలి. తమ కులం వాడనో, తమ మతం వాడనో, తమ వర్గం వాడనో ఓటు వేస్తే ప్రజలు ప్రజాస్వామ్య ఫలాల కోసం ప్రశ్నించే హక్కును కోల్పోయినట్లే. ఎన్నికలలో పోటీ చేసే వారి నుం చి ఎటువంటి తాయిలాలను ఏ రూపంలోనూ ఆశించకూడదు.

మనమంతా ఒక్కటే

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాట ల్లో ప్రజల ఆర్థిక, సామాజిక జీవితాల్లో విప్లవాత్మక మార్పులను ఏ రక్తపాతమూ లేకుండా తెచ్చే ప్రభుత్వరూపమే ప్రజాస్వామ్యం. మన ప్రజాస్వామ్య లక్షణాలు దేశ విభిన్న సామాజిక, సాంస్కృతిక దృశ్యాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ మేరకు అవి ప్రజాస్వామ్య సూత్రాలను, నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని అనుసరించడం ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇక్కడ అధికా రం కేంద్ర ప్రభుత్వంతోసహా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజితమైంది. 18 ఏళ్లు పైబ డిన ప్రతి భారతీయ పౌరుడికీ ఓటుహక్కు ఉంది. సమాజంలోని అన్నివర్గాల భాగస్వామ్యాన్ని ఓటు నిర్ధారిస్తుంది. ప్రతి పౌరుడూ తప్పనిసరిగా కొన్ని బాధ్యతలను తెలుసుకోవాలి.

అందరూ భారత రాజ్యాంగానికి బద్ధులై ఉండాలి. జాతీయ పతా కాన్ని, జాతీయ గీతాన్ని, రాజ్యాంగ ఆశయాలను, ప్రభుత్వ సంస్థలను గౌరవిం చాలి. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి స్ఫూర్తినిచ్చిన మహోన్నత ఆశయాలను అనుసరించాలి. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమైక్యతను కాపాడాలి. దేశాన్ని సంరక్షించుకోవడం కోసం అవసరమైనప్పుడు ప్రభుత్వానికి సేవలు అందించాలి. పేద గొప్ప, కుల మత, ప్రాంతీయ, వేర్పాటువాద, భాషాపరమైన సంకుచిత భావా లకు అతీతంగా సోదరభావాన్ని, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించాలి. స్త్రీల గౌరవాన్ని కించపరిచే పద్ధతులు, చర్యలను నిరసించాలి. విభిన్న సంస్కృతులతో సమ్మిళితమైన మన ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించాలి.

అడవులు, సరస్సులు, నదులు, వన్య మృగాలతోసహా జాతీయ పర్యావరణాన్ని సంరక్షిస్తూ, సమ స్త జీవులపట్ల ప్రేమానురాగాలను కలిగి ఉండాలి. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతా వాదాన్ని, వైజ్ఞానిక జిజ్ఞాసను, సంస్కరణలను పెంపొందించుకోవాలి. హింసావా దాన్ని వ్యతిరేకించాలి. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలి. వ్యక్తిగతంగాను, సమష్టి కృషిద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించగలం. తద్వార దేశ ఔన్నత్యాన్ని పెంపొందించాలి.

ప్రచ్ఛన్న యుద్ధం, అసంఖ్యాకమైన పోరాటాలు, సంక్షోభాల మధ్య కూడా ఆరున్నర దశాబ్దాలపాటు ఏ సమాజమై నా ప్రజాస్వామ్య వ్యవస్థను అట్టిపెట్టుకుని ఉండడం గొప్ప విజయం. దీనిని భారతదేశం సాధించింది. అందుకు భారతీయు లుగా మనమంతా గర్విద్దాం. ఈ అంశాన్ని సాపేక్షంగా చూసి ప్రపంచం సైతం విస్తుపోతున్న మాట వాస్తవం.

జీఎస్టీపై మాట్లాడినందుకు ఓ హోటల్ యజమానితో  బలవంతంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పించడం సిగ్గుచేటు. ఇది ఎంతో నిరుత్సాహకరమైన చర్య. కేంద్రమంత్రి స్థాయిలోని వారు అలా చేయడం సిగ్గుచేటు. కేంద్రప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రజలు చూస్తూనే ఉన్నారు.

ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోలకు పోజులిచ్చేందుకు, వైద్యుల్లో అనుమాన బీజాలు నాటేందుకు నిరసన శిబిరానికి వెళ్లారు. వైద్యులు కూడా సీఎం మాటలను నమ్మడం లేదు. అసలు ఈ సమస్యను పరిష్కరించి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశమే ఆమెకు లేదు. ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రంలో వైద్యరంగం దెబ్బతింటోంది.

అమిత్ మాలవీయ, బెంగాల్ బీజేపీ కో ఇంచార్జి