calender_icon.png 20 October, 2024 | 5:16 AM

మేధావుల సూచనలతో ముందుకెళ్తాం

20-10-2024 03:06:41 AM

బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ 

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): మేధావుల సూచనలను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్తామని బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను నిర్ణయించడంపై అభిప్రాయా లు, సలహాలు సేకరించేందుకు శనివారం బీసీ కమిషన్ కార్యాలయం లో బీసీ మేధావుల సమావేశాన్ని నిర్వహించారు. రిజర్వేషన్ల నిర్ధారణకు కుల సర్వే డేటా ప్రాతిపదికగా ఉండాలని, వారి జనాభాకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను నిర్ధారిం చేందుకు, న్యాయ పరిశీలనను తట్టుకునేందుకు అధ్యయనంలో అడుగ డుగునా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేధావులు తమ అభిప్రాయా లను వ్యక్తం చేశారు. కుల సర్వే, స మాచార సేకరణ ప్రశ్నాపత్రం, ఎన్యుమరేటర్ల ఇంటి సందర్శన వివరాలు, సర్వే సమయంలో సరైన స మాచారం అందించాల్సిన ఆవశ్యకతపై విసృత ప్రచారం ద్వారా సామా న్య ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని సూచించారు. మేధావుల సూచనలు, సలహాలను పరిగ ణనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరం జన్ వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, డాక్టర్ పీ వినయ్‌కుమార్, ప్రొఫెసర్ కే మురళీ మనోహర్, ప్రొఫెసర్ ఐ తిరుమలి, ప్రొఫెసర్ సింహాద్రి, టీపీసీసీ మేధావుల సెల్ అధ్యక్షుడు ఎం శ్యామ్ మోహన్, ప్రొఫెసర్ ఎం భాగయ్య, డాక్టర్ షేక్ అబ్దుల్ ఘనీ తదితరులు పాల్గొన్నారు.