calender_icon.png 23 December, 2024 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీస్తు అడుగుజాడల్లో నడుద్దాం

23-12-2024 03:06:58 AM

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 

మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

మెదక్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): విశ్వాసానికి, దైవ సాన్నిధ్యానికి ప్రతీకగా మెదక్ చర్చి నిలిచి ఎందరో జీవితాల మార్పునకు శ్రీకారం చుట్టిందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ అన్నారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా వందేళ్లు పూర్తిచేసుకున్న మెదక్ చర్చిని సందర్శించారు.

చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గవర్నర్ మాట్లాడుతూ.. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్ నగేశ్ చర్చి కమిటీ సభ్యలు పాల్గొన్నారు.

కొల్చారంలో సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులతో ముఖాముఖి..

అనంతరం మెదక్ జిల్లా కొల్చారంలోని తెలంగాణ రాష్ట్ర బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థినులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి చర్చా కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు.

విద్యాలయాలు దేవాలయాలతో సమానమని, చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో మెలుగుతూ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకోవాలన్నారు. విద్యార్థినులతో కలిసి గవర్నర్ భోజనం చేశారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ వర్షిణి, పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.