calender_icon.png 12 January, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరాముడి ఆశీస్సులతో ఆదర్శంగా అభివృద్ధి చేసుకుందాం

12-01-2025 12:09:32 AM

శ్రీరామ కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి 

మహబూబ్ నగర్, జనవరి 11 (విజయ క్రాంతి): శ్రీరాముడి ఆశీస్సులతో అందరికీ ఆదర్శంగా ఉండేలా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. అయోధ్యలో బాల రాముడి విగ్రహావి ష్కరణ ప్రతిష్ఠ జరిగి సంవత్సరం అవుతున్న సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణం లోని పాత గంజి లో హైందవ శక్తి సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరై శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు.

హైదవ శక్తి సేవ సంస్థ సేవలు అమోఘమని కొనియాడారు. ఆధ్యాత్మిక చింతన నేటి ఈ సమాజంలో మనిషికి ఎంతో అవసరమన్నారు. శ్రీరాముడి వేషధారణ లో చిన్నారులు కనువిందు చేశారు.అంతకుముందు జిల్లా కేంద్రంలోని గ్రీన్ బెల్ట్ దగ్గర 218 జయంతి వేడుకలను పురస్కరించుకొని వడ్డెర ఓబన్న విగ్రహానికి ఆవిష్కరణ చేశారు.

జున్ను రాఘవులు స్మారకార్థం వారి భార్య డైట్ కళాశాలలోని ప్రిన్సిపల్ గదిని పునర్ నిర్మించింది గాను ముందుకు రావడంతో నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.  రజకుల ఆరాధ్య దైవం శ్రీ మడిమాల మాచయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జాతీయ హెడ్ వాల్ పోటీలు రెండవ రోజు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి హాజరై ప్రారంభించి క్రీడాస్ఫూర్తిని  చాటాలని సూచించారు.  ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కమల్ కేషవ్, శ్రీనివాసులు, శివకుమార్, సంతోష్ కుమార్, రామకృష్ణ తదితరులుపాల్గొన్నారు