తెలంగాణ ప్రజలు గత 65 సంవత్సరాలుగా దగా పడుతూనే ఉ న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర వ లస పాలకుల ఒత్తిడికి నలిగిపోయినారు. రాజకీయంగా, సామాజికంగా,ఆర్థికంగా తీ వ్రంగా నష్టపోయిన తెలంగాణ ప్రజలు ఆంధ్ర వలస పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటమే 1969 నుండి 2014 వరకు జరిగిన తొలి దశ, మలిదశ ఉద్యమం. రాష్ట్ర ప్రజలు పట్టు సడలని దీక్షతో ఉద్యమాన్ని కొనసాగించి సాధించుకున్న తెలంగాణను అప్రజాస్వానిక వాదులకు అప్పజెప్పడం జరిగింది.
తె లంగాణ ప్రజలు ఆంధ్ర వలస పాలకుల కాళ్ల కింద నలిగిపోయి ఉవ్వెత్తున ఎగిసిపడి మొదటి దశ ఉద్యమంలో 369 మం ది ఉస్మానియా విద్యార్థులు ఆత్మ బలిదానం చేసినారు. నాటినుండి నేటివరకు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగించారు.
పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా..
ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఆంధ్ర వలస పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా మొ దలైంది. ఉద్యోగ నియామకాలు, నీళ్లు, ని ధులు సర్వం దోచుకుంటున్న విషయాన్ని గమనించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రజలు పోరాటంలో చూపిన స్ఫూర్తి మంచి పరిపాలకులను ఎ న్నుకోవడంలో చూపలేకపోయారు. దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రజల అ మాయకత్వం, మంచితనం. ఎటువంటి వ్య క్తినైనా నమ్మడం తెలంగాణ ప్రజల మనస్త త్వం.
దీనిని ఆసరాగా చేసుకొని ఆంధ్ర వలస పాలకులు 50 సంవత్సరాలు పరిపాలన చేసి సర్వం దోచుకుపోవడమే కా కుండా, రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కిన విషయం మనందరికీ తెలిసిందే. అ యితే దగా పడిన తెలంగాణలో 2001లో కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన మ లిదశ ఉద్యమం ప్రధానంగా మూడు అం శాలపై కొనసాగింది. ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటిపై అణగారిన తెలంగాణ ప్రజలు వీరోచితం గా తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ను దోపిడీ వర్గాల చేతిలో పెట్టి నష్టపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే.
ఏ అంశాలపైన తెలంగాణ ఉద్యమం సాగిం దో ఆ అంశాలతోనే సాధించుకున్న తెలంగాణలో యువతకు, నిరుద్యోగులకు, కాం ట్రాక్టు ఉద్యోగస్తులకు, ప్రజలకు ఏ మేరకు నష్టపోయామో అర్థమై 2023 ఎన్నికలలో నాటి పాలకులను చిత్తుగా ఓడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రం నేడు అప్పులకు నెలవుగా మారింది. 2014 నుం డి 2023 వరకు 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న నాయకులు మన కళ్ల ముందే మళ్లీ ఏమి తెలియని అమాయకుల్లా తిరుగుతున్నారు.
లక్షల కోట్ల రూపాయ లు అవినీతి జరిగిందంటూ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అవినీతి ని రోధక శాఖ అధికారులు చేస్తున్న దాడులను బట్టి చూస్తే తెలుస్తుంది. తెలంగాణ ప్రజల అమాయకత్వం వారి దోపిడీని ప్రశ్నించలేక పోతోంది. దోచుకుని దాచుకున్న సొమ్మును అమాయక తెలంగాణ ప్రజలు అడగలేక పోతున్నారు. పది సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి తెలంగాణ ప్రజలు ఏమి కోల్పోయారో తెలుసునని మాట్లాడడం విడ్డూరంగా ఉం దని ప్రజలు చర్చించుకుంటున్నారు.
పది సంవత్సరాల పరి పాలన కాలంలో ఉన్నతాధికారులనుండి గల్లీ నాయకుల వరకు చేతికి అందిన కాడికి దోచుకున్నది మన కళ్ల ముందు కనబడుతుంది. ఇటీవల హైదరాబాద్ చుట్టూ హైడ్రా పేరుతో చేపడుతున్న చర్యలే ఇందుకు నిదర్శనం.
1969నాటి తెలంగాణ ఉద్యమం
1969నాటి తెలంగాణ ఉద్యమం తె లంగాణ ప్రాంతానికి రాష్ట్ర సాధన కోసం జరిగిన రాజకీయ ఉద్యమం. రవీంద్రనాథ్ అనే వ్యక్తి 1969 జనవరి 8 న ఖమ్మం రైల్వేస్టేషన్ సమీపంలో నిరాహారదీక్ష చేపట్టారు. నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ఆయన ప్రధాన డిమాండ్ తెలంగాణా భద్రతను అమలు చేయాలనేది . జెంటిల్మన్ ఒప్పందాన్ని అమలు చేయాలనేది మరో డిమాండ్. తెలంగాణ ఉద్యమంలో ఇదొక ప్రధాన ఘట్టం . పోలీసుల విచక్షణారహిత కాల్పుల్లో అప్పుడు 369 మం ది తెలంగాణ విద్యార్థులు చనిపోయారు.
1953 డిసెంబర్ 22న భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు సిద్ధం కావడాని కి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను నియమించారు. ప్రజల డిమాండ్ కారణంగా కమిషన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని విడదీయాలని, మరాఠీ మాట్లాడే ప్రాంతా న్ని బొంబాయి రాష్ట్రంలో, కన్నడ మాట్లా డే ప్రాంతాన్ని మైసూర్ రాష్ట్రంలో విలీనం చేయాలని సిఫారసు చేసింది. రాష్ట్రాల పు నర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్‌ఆర్‌సీ) హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లా డే తె లంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం మధ్య వి లీనానికి సంబంధించిన లాభనష్టాలను చ ర్చించింది.
‘విశాలాంధ్ర ఆవిర్భావం ఒక ఆ దర్శం. ఆంధ్ర , తెలంగాణాలోని అనేక మంది వ్యక్తులు , ప్రజా సంఘాలు చాలాకాలంగా ఉద్వేగభరితంగా అనుబంధించ బడ్డాయి , దీనికి విరుద్ధంగా బలమైన కారణాలు లేకపోతే, ఈ భావాన్ని పరిగణనలో కి తీసుకోవడానికి అర్హులు’ అని తెలంగాణ కేసును చర్చిస్తూ ఎస్‌ఆర్‌సీ నివేదిక లోని పారా 389 పేర్కొంది. విశాలాంధ్ర వ్యతిరేకతకు ప్రధాన కారణాలలో విద్యాపరంగా వెనుకబడిన తెలంగాణలోని ప్రజ లు తమను కోస్తా ప్రాంతాలలోని అభివృ ద్ధి చెందిన ప్రజలు చిత్తు చేసి దోపిడీకి గురిచేస్తారనే భయం కూడా ఒకటి.
ఈ కా రణంగానే ఎస్‌ఆర్‌సీ తన తుది విశ్లేషణలో తక్షణ విలీనానికి వ్యతిరేకంగా సిఫార్సు చే సింది. ‘ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ప్రస్తుతానికి, తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అది ఆంధ్రా , తెలంగాణ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని మేము నిర్ధారణకు వ చ్చాము. దీనిని హైదరాబాద్ అని పిలుస్తా రు. 1961లో లేదా దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీతో అవశేష హైదరాబాద్ స్టేట్ యొక్క శాసనసభ అటు వంటి ఏకీకరణకు అనుకూలంగా వ్యక్తీకరించినట్లయితే, సాధారణ ఎన్నికల తర్వా త ఆంధ్రతో దాని ఏకీకరణకు అవకాశం ఉంది’ అని కమిషన్ తన నివేదిక పేరా 389లో అభిప్రాయపడింది.
ఎస్‌ఆర్‌సీ సి ఫార్సులను అనుసరించి, అప్పటి హోం మంత్రి పండిట్ గోవింద్ బల్లభ్ పంత్ పెద్దమనుషుల ఒప్పందాన్ని కుదిర్చారు.
ఐదు దశాబ్దాల పోరాట ఫలితం
1946 51 మధ్య జరిగిన తెలంగాణ ఉద్యమం భారతదేశంలో ముందుగా ఉన్న రాష్ట్రం నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాన్ని సూచిస్తుంది . కొత్త రాష్ట్రం 1956లో ఆంధ్ర ప్రదేశ్‌లో విలీనమై ముల్కీ ఆందోళనలకు దారితీసిన పూర్వపు రాచరిక రాష్ట్రమైన హైదరాబాద్‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలకు అనుగుణంగా ఉంది . దశాబ్దాల నిరసనలు, ఆందోళనల తరువాత, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించింది.
2014 జూన్ 2 న, కేంద్ర మంత్రివర్గం ఏకపక్షంగా తెలంగాణ ఏర్పాటు బిల్లును ఆమోదించింది. దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగిన తెలంగాణ ఉద్యమం దక్షిణ భారతదేశంలో రాజ్యాధికారం కోసం సుదీర్ఘంగా సాగిన ఉద్యమాలలో ఒకటి. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ వాయిస్ ఓటుతో బిల్లును ఆమోదించింది. తదనంతరం బిల్లును రాజ్యసభ రెండు రోజుల తర్వాత ఫిబ్రవరి 20న ఆమోదించింది. బిల్లు ప్రకారం, హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా ఉంటుంది.
అయితే నగరం పదేళ్లకు మించకుండా అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా కూడా ఉంటుంది. 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర్ రావు ప్రమాణం చేశారు. అయితే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్థికంగా మిగులు ఉన్న రాష్ట్రాన్ని, అప్పుల పాలు చేసి, నిరుద్యోగులను, విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేసిన ఘనత గత పాలకులదే. తెలంగాణ పునర్నిర్మాణానికి మరొక తీవ్రమైన ఉద్యమం రావాల్సిన అవసరం ఎంతయినా ఉందనిపిస్తుంది.