15-04-2025 01:10:35 AM
తరిగొప్పుల ఏప్రిల్ 14 (విజయక్రాంతి): అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాతా బాలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ. జై భీం, జై భీం, కొనసాగిస్తాం, కొనసాగిస్తాం , అంబేద్కర్ ఆశయాలని, దేశంలో ఒక్క నలుగురు వ్యక్తులు దేశం కోసం పని చేశారు. బాబు జన్జీవన్ రావు, పులే,సావిత్రి భాయ్ పులే వీరు పని చేశారు. ఇవ్వాలా ప్రతి ఒక్కరూ చదువుతున్నారు.
అంటే దానికి కారణం వీరు రచించన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఏం రాసిందో దానికి లోబడే చేసుకోవాలి కానీ రాజ్యాంగాన్ని దాటి ఏమి చేయడానికి లేదు ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మనది అలాగే అందరికంటే శక్తివంతమైనది మన రాజ్యాంగం మనకి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఇచ్చారన్నారు. ఉపాధ్యక్షుడు చింతల రమేష్, కోశాధికారి మేకల కిష్టయ్య, కార్యదర్శి చింతల సురేష్ బాబు, సుక్క యాదగిరి, చింతల్ ఎల్లయ్య, బాలకిష్టయ్య, వెంకన్న, కుమార్, పరుశురాములు, సందీప్, ఖాతా బాలయ్య,సభ్యులు, మండల నాయకులు, నరసింహారావు, జూమ్ లాల్, అర్జుల సంపత్ రెడ్డి, భాష బోయిన రాజు, తాళ్లపల్లి రాజేశ్వర్, చిలువేరు లింగం, భోగ శీను, రామరాజు పాల్గొన్నారు.
మానుకోటలో
మహబూబాబాద్, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్లె నుండి మొదలుకొని పట్టణం వరకు అంబే ద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనా యక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, అదనపు కలెక్టర్ కె. వీరబ్రహ్మచారి, డిసిసి అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు ప్రోత్సాహక నగదు చెక్కులను అందజేశారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అంబేద్కర్ జయంతి నిర్వహించారు. అంబే ద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుఅర్పించారు. కేసముద్రం పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, ఎస్త్స్ర మురళీధర్ రాజ్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
అంబేద్కర్‌కు ఘన నివాళి
రాయపర్తి,: అంబేద్కర్ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో శుభోదయ యూత్ అసోసియేషన్ ఘనంగా నివాళి అర్పిం చింది. ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపటి శ్రీనివాస్రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. రాయపర్తి మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్గౌడ్, ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేతాకుల రంగారెడ్డి, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్రాథోడ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ భవన్ లో
హనుమకొండ, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే అంబేద్కర్ జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని, దళిత, ప్రభుత్వ ఇతర సంస్థ అధ్యక్షులు గిరిజన, వెనుకబడిన తరగతుల, నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేసినారు.
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే.ఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య లు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుస్రు పాషా, రాష్ట్ర ఫైనాన్సు కమీషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, బెల్లయ్య నాయక్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూచన రవళి, హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెరుమండ్ల రామకృష్ణ, ఈ.వి. శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ.
హనుమకొండ, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): అంబేద్కర్ స్ఫూర్తి ని కొనసాగిద్దామని,అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బాలసముద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం విజయభాస్కర్, వరంగల్ పశ్చిమ కోఆర్డినేర్ పులి రజనీకాంత్, కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు, మాజీ కార్పొరేటర్లు మేకల బాబురావు, జోరిక రమేష్, యాకూబ్ రెడ్డి ,రాష్ట్ర, జిల్లా, డివిజన్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.