calender_icon.png 25 December, 2024 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురయ్య ఆశయాలను కొనసాగిద్దాం

24-12-2024 12:30:42 AM

ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య

బానిస సంకెళ్లు తెంపిన యోధుడు..

మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్

మహబూబాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ తొలి అమ రుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలని ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐల య్య అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్‌తో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి దశ ఉద్యమంలో దొడ్డి కొమురయ్య ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని అన్నారు.

దొడ్డి కొమురయ్య ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. బానిస సంకెళ్లు తెంపిన మహా యోధుడు దొడ్డి కొమురయ్య అని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. బలహీన వర్గాలు సంఘ టితంగా ఎదగడానికి దొడ్డి కొమురయ్య స్ఫూర్తిగా నిలిచాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫ్రొఫెసర్ కంచ ఐలయ్య, విమలక్క, దొడ్డ చంద్రం, కురమ సంఘం జిల్లా అధ్యక్షుడు చీరా అశోక్, మండల అధ్యక్షుడు ఉపేందర్, కోరే పాపయ్య, మాజీ ఎంపీపీ నూనవత్ రమేష్ నాయక్, చీర భిక్షపతి, వాంకుడోతు కొమ్మాలు పాల్గొన్నారు.