calender_icon.png 27 December, 2024 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మహత్యలను నివారిద్దాం

10-09-2024 12:00:00 AM

మనిషి జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోక పోవడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడటం పరిపాటిగా మారిపోయింది. ఇది ప్రపంచ మానవాళికి జటిల సామాజిక, ప్రజారోగ్య సమస్యగా పరిణమిం చింది. చాలా మరణాలకు రోడ్డు ప్రమాదాల తర్వాత రెండో ప్రధాన కారణం ఆ త్మహత్యలే అని అనేక అధ్యయనాల్లో తే లింది. చనిపోయే ముందు ఒక్క క్షణం వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచి స్తే పరిస్థితి మరో రకంగా వుంటుందని అంచనాలు చెబుతున్నాయి.  ఆత్మహత్య ల వల్ల పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఆర్థిక, సామాజిక సమస్యల లో కూరుకుపోతున్నాయి.

‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా ప్రతి ఏటా 7 లక్షల మందికి పై గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇం దులో 77  శాతం కేసులు ‘తక్కువ, మ ధ్యాదాయ దేశాలలో’ నమోదవుతున్నాయి. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్లుటీవో) నివేదిక ప్రకారం వ్యవసాయ రంగంలో సంభవిస్తున్న అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు, పంటలకు పురుగు తగలడం, ముఖ్యంగా పత్తి రైతులు ఆశించిన దిగుబడి రాకపోవడం, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించక పోవడం వంటి కారణాలవల్ల అనేకమంది పురుగుమందులు తా గి లేదా ఉరి వేసుకుని ఆత్మహత్యలు చే సుకుంటున్నారు.

ఏటా సెప్టెంబర్ 10 తే దీని ఆత్మహత్యల నివారణ దినంగా పాటిస్తూ, ఈ మేరకు ప్రజలకు తగిన అవగాహన కలిగించడానికి కృషి జరుగుతున్నది. యువతలో పేరుకు పోయిన ని రాశ నిస్పృహలు వారిని జీవితంపై వి ముఖతను పెంచుతున్నాయి. చేనేత కార్మికులు, నిరుద్యోగుల నిరాశకు పరిశ్రమలు మూతపడడం, ఉపాధి కోల్పోవడం వం టివి కారణమవుతున్నాయి. పరీక్షల్లో ఫె యిలవడం విద్యార్థులను ఆత్మహత్యల వై పు పురికొల్పుతున్నది. ఆత్మహత్య చేసుకునే వాళ్లలో యు వకులే ఎక్కువ శాతం ఉంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. వారిలో 15 సంవత్సరాల వయసువారు ఎక్కువగా ఉంటున్నారు. ప్రేమ వి ఫలం కావడం, పెద్దలు మందలించడం వంటివీ కారణమవుతున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా 20 శాతం ఆత్మహత్యలు భారతదేశంలో జరుగుతున్నాయి. ఒకప్పుడు దేశంలో మధ్యవయస్కులు, వృద్ధులు ఆత్మహత్యలు చేసుకుం టే ఇటీవలి కాలంలో యువత, ప్రత్యేకించి విద్యా ర్థుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటుండడం విచారకరం. ఆత్మహత్యల కు పాల్ప డేవారిని గుర్తించి, వారికి ‘ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్’ ఇవ్వాలి. వారి బాధ ను ఓపికగా విని, సానుభూతి చూపించడమేకాక వారి సమస్యకు పరిష్కారం అందించాలి. జీవితంపై అవగా హనను, కొత్త ఆశను పెంపొందింపజేయాలి. ఇలాంటి బృహత్ కార్యాచరణ ద్వారా ‘ఆత్మహత్యల రహిత సమాజాన్ని’ నిర్మించవచ్చు.

- నేదునూరి కనకయ్య