calender_icon.png 2 November, 2024 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం

19-07-2024 12:49:31 AM

  • విద్యార్థులకు చిన్నపట్టి నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి 
  • ట్రాఫిక్ ఏసీపీ శంకర్‌రాజు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిం చాలని ట్రాఫిక్ ఏసీపీ జీ శంకర్‌రాజు అన్నారు. గురువారం బొల్లారం రిసాలబజార్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బేగంపేట ట్రాఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై  పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని, రోడ్డు భద్రత, నియమాల గురించి వారి బోధనాంశాలలో కూడా చేర్చాలని అన్నారు.

పాఠశాలకు వచ్చే క్రమంలో ఆటోలలో ఐదుగురి కంటే ఎక్కువగా విద్యార్థులు ఎక్కవద్దని, స్కూల్ యాజమాన్యం కూడా ఆటోలపై నిఘా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా లైన్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ వంటి వాటి ఉపయోగం గురించి వివరించారు. కార్యక్రమం లో సుమారు 150 మంది విద్యార్థులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.