06-03-2025 07:03:22 PM
నిర్మల్ (విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని నిర్మల్ డిఎం ప్రతిమారెడ్డి అన్నారు. గురువారం ఎండి సంజన ఆదేశాలకు నిర్మల్ డిపోలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 5 వరకు ప్రతి డిపోలో ఆర్టీసీ సంరక్షణ బాధ్యత ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై సిబ్బందికి దిశా నిర్దేశం చేయడం జరిగిందని ఆమె తెలిపారు. సంస్థ మనకడుతోని మన కుటుంబాలు ఆధారపడ్డాయని అందుకే ఆర్టీసీ సిబ్బంది సంస్థ పరిరక్షణ కోసం కష్టపడి పని చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నవీన్ కుమార్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.