calender_icon.png 23 December, 2024 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద నీరు కాలువల ద్వారానే పోయేలా చేద్దాం

07-10-2024 12:45:41 PM

లోతట్టు ప్రాంతాలకు రక్షించేందుకు పక్కా ప్రణాళికలు

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : లోతట్టు ప్రాంతాలకు వరదనీరు రాకుండా పూర్తి స్థాయిలో వాళ్లదారిన పోయేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సోమవారం  మహబూబ్ నగర్ పట్టణం లోని భగీరథ కాలనీ లో ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తో కలిసి పర్యటించారు.  కాలనీల్లో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు, కాలనీలో తిరిగి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భగీరథ కాలనీ లేఅవుట్ గత 25 సంవత్సరాల క్రితం చేసిందని, కాలనీ చాలా పెరిగిందని, ఇక్కడ ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కూలిపోయిందని, వెంటనే  డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, పట్టణంలో నుంచి డ్రైనేజీ  నీరు ను మహబూబ్ నగర్ పట్టణం నుంచి బయటికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని, అధికారులను ఆదేశించారు.

మరో ఆరు మాసాలలోపు ఈ పనులు పూర్తి చేసి సమస్య పరిష్కారం చేస్తామన్నారు. ఎందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్ చైర్మన్, అధికారులను ఆదేశించారు.  పక్కా ప్రణాళిక తోటి రానున్న 4,5 సంవత్సరాల కాలంలో మహబూబ్ నగర్ పట్టణంలో రోడ్డు,  డ్రైనేజీ వ్యవస్థ ను  పూర్తి చేసి, ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటి నుండి ఈ ప్రాంతాన్ని రక్షించడానికి వీలైనంత వరకు కృషి చేస్తాననిహామీ ఇచ్చారు. నూతనంగా నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణం విషయంలో కూడా ప్రజల పూర్తి స్థాయిలో సహకారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కౌన్సిలర్లు ప్రశాంత్, మోయిన్ అలి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,  ఇఇ యు.బస్వరాజు,  ఎఇ వైష్ణవి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, భాజాపా పట్టణ అధ్యక్షులు పాండురంగ రెడ్డి,  సుదర్శన్ రెడ్డి, జగదీశ్వర చారి వెంకటేశ్వరరావు, వెంకటరామిరెడ్డి  పాల్గొన్నారు.