calender_icon.png 28 September, 2024 | 4:52 PM

డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రభుత్వానికి సహకరిద్దాం

26-09-2024 12:51:00 AM

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరిం చాలని టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు ఆకర్షితులై ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీమ్‌కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా రూపొందించిన ప్రత్యేక వీడియోను ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ‘మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంత మంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో, లేదంటే సహచరుల ప్రభావం వల్లనో, స్టుల్ కోసమో..

మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇది చాలా బాధాకరం. జీవితం చాలా విలువైంది. రండి.. నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమై లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి.

రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగి స్తున్నా.. వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించండి’ అని విజ్ఞప్తి చేశారు. ‘దేవర’ సినిమా ఈ నెల 27న విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ ధరల పెంపులో భాగంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్టీఆర్ ఈ వీడియోను రూపొందించారు.