calender_icon.png 22 October, 2024 | 5:02 PM

మెల్లి మెల్లిగా తగ్గిద్దాం

24-06-2024 12:00:00 AM

తిండి లేకపోయిన పర్వాలేదు. కాని చేతిలో ఫోన్ లేకుంటే రోజు గడవదు. ఓ అధ్యయనం ప్రకారం సగటున ఒక వ్యక్తి రోజుకు 2,617 సార్లు ఫోన్ తాకుతున్నాడట. అంటే ప్రతీ మూడు నిమిషాలకు ఓసారి ఫోన్ చూస్తున్నాడన్నమాట. పెరిగిన స్క్రీన్ టైమ్ కారణంగా కంటి చూపుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నది. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్మార్ట్ వ్యసనాన్ని ఇస్మార్ట్‌గా దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

  1. ఫోన్ ఎంత తగ్గింద్దామనుకున్నా.. నోటిఫికేషన్ టోన్ రాగానే అలర్ట్ అయిపోతుంటాం. ఆ టైమ్‌లో ఎంత బిజీగా ఉన్నా.. మరుక్షణం ఫోన్ పట్టేసుకుంటాం. ఇలా కావొద్దంటే.. వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల నోటిఫికేషన్లు మ్యూట్ చేసుకోవడం మంచిది.  
  2. చాలామంది పడుకునేటప్పుడు ఫోన్ పక్కనే పెట్టుకుంటారు. అర్ధరాత్రి దాకా ఫోన్ చూస్తూ ఉంటారు. పడగ గదిలోకి ఎంటర్ కావడంతోనే ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టేయండి. ఉదయం లేవగానే ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టేయండి. ఉదయం లేవగానే ఫోన్ చూస్తూ రోజును ప్రారంభించకండి. మీ పనులు పూర్తయ్యాక ఫోన్ అందుకోండి. 
  3. కాలక్షేపానికి కబుర్లు చెప్పుకోండి గానీ, ఫోన్‌లో ఆటల్లో మునిగిపోకండి. పుస్తక పఠనాన్ని అభిరుచిగా మలచుకోండి. పెయింటింగ్, ధ్యానం, యోగ లాంటి అభ్యాసాలు ఫోన్‌కు, మీకు కాసేపైనా దూరం పెంచుతాయి. అదే పనిగా ఫోన్‌లో తల దూర్చకుండా.. ఇంటి పనుల్లో సాయం చేయండి. 
  4. స్క్రీన్ టైమ్ ఇంత అని ఫిక్స్ చేసుకోండి. దానిని మించకుండా ప్రయత్నం చేస్తే.. కొన్నాళ్లకు స్మార్ట్ ఫోన్ ఉచ్చు నుంచి బయటపడగలుగుతారు.