11-02-2025 06:58:50 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఎన్నో సంవత్సరాలుగా టోల్ ప్లాజాలో పనిచేస్తున్న కార్మికులను తొలగించకుండా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే విధంగా చూస్తామని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టోల్ ప్లాజా కార్మికులకు హామీ ఇచ్చారు. మంగళవారం సోను మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా కార్మికులు తమను తొలగించేందుకు యాజమాన్యం కుట్రలు పడుతుందని తాము ఉపాధి కోల్పోతామని మంత్రికి విన్నవించారు. ఈ విషయమై నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి తప్పకుండా న్యాయం చేసే విధంగా చూస్తారని వారికి హామీ ఇచ్చారు.