calender_icon.png 1 March, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతన్నలకు భరోసా ఇద్దాం

28-02-2025 12:00:00 AM

‘భారతదేశ వ్యవసాయదారుడు అప్పుల్లోనే పుట్టి అప్పుల్లోనే చనిపోతాడు’. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా పై నానుడిలో ఎలాంటి మార్పు లేకపోగా నిత్యం రైతుల ఆత్మహత్య లు జరుగుతూ ఉన్నాయి. దేశంలో ప్రతి అ ర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రతిరోజూ 2000 మంది వ్యవ సాయాన్ని వదిలిపెట్టి ఇతర రంగాలకు వల స పోతున్నారు.

మిగతా 40 శాతం మంది లాభాలు వచ్చే వ్యవసాయం చేయడం లే దు. కేవలం వారు ఉన్న ఊరును, కన్నతల్లి ని, భార్యా పిల్లలను వదిలిపెట్టి ఇంకో ప్రాం తానికి వెళ్లలేక బిక్కు బిక్కు మంటూ వ్యవసాయాన్ని  కొనసాగిస్తున్నారు. మనదేశం లో మానవ సంపద చాలా పుష్కలంగా ఉం ది.

ప్రపంచంలో పండే అన్ని రకాల పం టలు కూడా మనదేశంలో  పండించే రైతు లు ఉన్నారు. కేవలం ఆదాయ భద్రత లేని ఏకైక రంగం వ్యవసాయం. కనీసం పెట్టిన పెట్టుబడులు రాక, కుటుంబాన్ని పోషించుకోలేక తెచ్చిన అప్పులను తీర్చే మార్గం లేక వారి వారి పంట పొలాల్లోనే ఉరికొయ్యలను ముద్దాడుతున్న రైతుల శవాలను ప్రతిరోజూ వివిధ దినపత్రికలలో చూస్తూనే ఉన్నాం. ఇటీవలి కాలంలో తెలంగణలోని మొదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్, సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లి, జనగామ జిలాల నర్మెటలో చనిపోయిన రైతులంతా చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యలు చేసుకున్నా వాళ్లే,

ఇప్పటికీ భారత దేశ ప్రజలు సుమారు 63శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ ప్రాధాన్యత గల దేశంగా పేరుగాంచిన మనదేశంలో ఇప్పటికి వ్యవసాయ విధానం లేకపోవడం వ్యవసాయం పట్ల ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అటు ప్రతిపక్షమైనా, ఇటు ప్రభుత్వం అయినా రైతుల బతుకులకు భ రోసానిచ్చే మాటలు మాట్లాడాలే తప్ప ఆ త్మహత్యలకు పాల్పడే మాటలు మాట్లాడడం మంచిది కాదు

. ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు మారినంత మాత్రాన రైతుల ఆత్మహత్యలు ఆగవు. వ్యవసాయ విధానం లేకపోవడంతో దేశవ్యాప్తం గా 1995 నుండి 2022 వరకు సుమారు నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు నివేదికలు తెలుపుతు న్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో16, 494 మంది,  తెలంగాణ ఏర్పడ్డాక  10 సంవత్సరాలలో 6,700 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదికలు తెలుపుతున్నాయి.

ప్రభుత్వానిదే బాధ్యత

 ఈ నవంబర్ నెలలో కురిసిన వర్షాల తర్వాత మళ్లీ వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో  పంటలు ఎండిపోవడంతో పంటలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పులు చేసి బోర్లు వేస్తూ బోర్లలో నీళ్లు రాక పంటలు ఎండిపోవడంతో పాటు అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

 ఇప్పుడు రైతాంగానికి బతుకుపైన భరో సా ఇచ్చి రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. నీటి కరువు ఒక వైపు, అప్పుల భారం ఒకవైపు, ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు రైతును ఎప్పుడూ కుంగదీస్తూనే ఉండడంతో భవిష్యత్తు మీద భరోసా లేక అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

వానాకాలంలో కొనుగోలు చేసిన వరి పం టకు ప్రకటించిన 500 బోనస్‌ను ప్రభు త్వం వెంటనే చెల్లించాలి. ఇప్పటికైనా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జీవో ఎంఎస్ నంబర్ 194 ప్రకారం ప్రతి కుటుంబానికి ఆరు లక్షల రూ పాయలు ఇచ్చి రైతు కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతాంగం విజ్ఞప్తి చేస్త్తోంది.

ఈ యాసంగి ఇ ప్పుడే ఎండలు ఎక్కువై ఈ  కరువు పరిస్థితులను చూస్తుం టే భవిష్యత్తులో రైతుల ఆత్మ హత్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభు త్వం, ప్రతి రాజకీయ పార్టీ, పౌర సమాజం పైన ఉంది. రైతన్నలూ ఎవరు కూడా అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవదు,్ద  మీకు అండగా తెలంగాణ సమాజం ఉంది.

-పులిరాజు