27-03-2025 08:43:24 PM
జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ పేడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవరెడ్డి రాష్ట్ర నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు..
రామగిరి (విజయక్రాంతి): భారతదేశంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, రాజ్యాంగాన్ని గౌరవిద్దామని జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ పేడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవరెడ్డి రాష్ట్ర నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు పిలుపునిచ్చారు. గురువారం కమాన్పూర్ రామగిరి ముత్తారం మండల కేంద్రాల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధన్ అభియాన్ సన్నాహక సమావేశంలో చైర్మెన్ జంగా రాఘవ రెడ్డి, మంత్రి సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్"అభియాన్ పై అమిత్ షా అహంకార పూరిత వ్యాఖ్యలు క్షమించరానివని, కేంద్రంలోని, బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తోందని ఆరోపించారు.
బీజేపీ రాజ్యాంగ మార్పు కుట్ర ప్రజలకు తెలియజేయాలని, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని గ్రామాలలో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతిరోజు రెండు గ్రామాలను సందర్శించి కాంగ్రెస్ పార్టీ జెండాలతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వివరించాలన్నారు. రాజ్యాంగ రక్షణే మా ప్రధాన లక్ష్యమని, రాజ్యాంగం అంబేద్కర్ పై జరుగుతున్న కుట్రలను గ్రామ ప్రజలకు తెలుపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ, ఫైనల రాజు, రోడ్డ బాబు, మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు, పిఎసిఎస్ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, మండల యూత్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ యాదవ్, రెబల్ సంపత్, మహిళ అధ్యక్షురాలు గోవిందుల పద్మ ఆనంద్, మాజీ యూత్ అధ్యక్షుడు శివకుమార్, ముత్తారం మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ, మైనారిటీ సెల్, బీసీ సెల్ మండల అధ్యక్షులు వాజీద్ పాషా, అల్లం స్వామి, నాయకులు కోల విజయ్, గాదం శ్రీను, నాయకులు అనుము సమ్మయ, దాసరి చంద్రమౌళి, లక్కం ప్రభాకర్, వనం రామచందర్ రావు, కాటం సత్యం ముస్తాల శ్రీను, తోట చంద్రయ్య, బర్ల శ్రీను, ఆరెల్లి కొమురయ్య గౌడ్, చొప్పరి సంపత్, ఎడవేన సంపత్, జితేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.