24-02-2025 12:24:11 AM
సీఐటీయూ రాష్ర్ట కార్యదర్శి జయలక్ష్మి
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వారికి అనుకూలంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా గ్రామస్థాయిలోనూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సిఐటియు రాష్ర్ట కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. ఆదివారం సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు వ్యతిరేకంగా సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులకు పెంచాల్సిన వేతనాల గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదని అసహనం వ్యక్తం చేశారు. కార్మికులకు ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్రం కదిలి వచ్చేలా నిరసన కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టి నిరసనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దిప్లా నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి జగన్, జిల్లా సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూ ర్తి, రాజ్ కుమార్, చంద్రకాంత్, వీరాంజనేయులు, గోనెల ఆంజనేయులు, సాధన, మహాలక్ష్మి, భాగ్య ,భగవంతు, కేశవులు, సావిత్రి పద్మ, సాయిలు విష్ణు పాల్గొన్నారు