20-04-2025 12:07:38 AM
సురక్షిత భారతాన్ని నిర్మిద్దాం..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): అగ్నిప్రమాదాల పట్ల అవగాహన పెంచుదాం.. సురక్షిత భారతాన్ని నిర్మిద్దాం..అని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా అన్నారు. ఫైర్ వీక్ సందర్భంగా నగరంలోని నెక్లెస్‌రోడ్ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పక్కన గల హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో తెలంగాణ అగ్నిమాపక, డీఆర్‌ఈ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను, ఫైర్ వాహనాల ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఆదివారం ఈ స్టాళ్లను నగరవాసులు సందర్శించవచ్చని పేర్కొన్నారు. అగ్నిప్రమాదాలను నివారించే వసుత్వులు, ఫైర్ ఫైటింగ్ రోబో, తదితర పరికరాలు ఈ స్టాళ్లలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.