calender_icon.png 22 February, 2025 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులి సరోత్తం రెడ్డిని గెలిపించండి..

21-02-2025 07:45:34 PM

పొనిశెట్టి వెంకటేశ్వర్లు...

పాల్వంచ (విజయక్రాంతి): వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి గెలుపు ఆకాంక్షిస్తూ శుక్రవారం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పాల్వంచలో వివిధ స్కూల్ లల్లో ఉపాధ్యాయులను కలిసి మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెల్పించవల్సిందిగా కోరారు. అనంతరం పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఉపాధ్యాయుల విషయంలో బీజేపీ పార్టీ అనేక పోరాటాలు చేసిందని అన్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిస్తే శాసనమండలిలో ఉపాధ్యాయుల 01-07-2023 నుండి అమలు కావాల్సిన PRC వర్తింపు కోసం కానీ DSC ఉపాధ్యాయులకు OPS విడుదల కోసం, ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం, DEO, DY, EO, DIET, MEO, JL పదోన్నతుల కోసం పోరాటం  చెయ్యాలంటే కచ్చితంగా బీజేపీ MLC అభ్యర్థి గెలవాలి అని అన్నారు.

రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్ల ను నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు కావాలన్న, గిరిజన, సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో నూతన పోస్ట్లు మంజూరు కావాలన్న స్కూల్స్ లో అన్ని సమస్యలు పరిస్కారం కావాలన్నా మహిళ ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్ సెలవులు కావాలన్న ఇచ్చిన మాట నిలబెట్టుకునే బీజేపీ పార్టీ అభ్యర్థి గెలవాలని అన్నారు. ఈ సమాజంలోని ప్రజలు అన్ని రకాలుగా  అభివృద్ధి చెందటానికి కారణం ఉపాధ్యాయులు అని అలాంటి ఉపాధ్యాయులకు గత ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ న్యాయం చెయ్యలేదని అన్నారు.

ఉపాధ్యాయ MLC ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేస్తున్న పులి సరోత్తం రెడ్డి గెలిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న MP MLA కేంద్ర మంత్రుల సహకారంతో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏ పని అయిన సహకారం చేయగలరని అన్నారు. ఉపాధ్యాయుల సకల సమస్యలకు పరిస్కారం బీజేపీ MLC అభ్యర్థి గెలవడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ మాజీ అధ్యక్షులు గంధం ప్రసాద్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మాదారపు లక్ష్మణ్, భట్టు నరేష్, పువ్వల వినయ్, దొడ్డ రాంబాబు, భట్టు అశోక్, పాపావత్ నరేందర్, రామకృష్ణలు పాల్గొన్నారు.