calender_icon.png 17 April, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం

08-04-2025 05:30:25 PM

తాడ్వాయి (విజయక్రాంతి): భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్, ఎర్ర పహాడ్ గ్రామాల్లో మంగళవారం జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, గైని శివాజీ, శ్యామ్ రావు, మద్ది మహేందర్ రెడ్డి, మేకల రాజు, షౌకత్ అలీ, సంజీవులు, సుధాకర్ రావు, అఖిల్ రావు, రాజలింగం, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.