14-04-2025 07:16:03 PM
రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిన బూనుదాం..
బడుగుల ఆశాజ్యోతి.. మానవ హక్కుల దిక్చూచి అంబెద్కర్..
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు..
సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 134వ జయంతి వేడుకలు...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): దేశాన్ని పాలిస్తున్న మతోన్మాద శక్తులతో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, ఈ శక్తుల నుంచి రాజ్యాంగాన్ని, దేశాన్ని పరిరక్షుచుకునే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. నవభారత రాజ్యంగా నిర్మాత, భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబెద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం సిపిఐ జిల్లా కార్యాలయం, పోస్టాఫీసు సెంటర్, బాబు క్యాంపు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రాంతాల్లో అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటైన సభల్లో కూనంనేని మాట్లాడారు. రాజ్యాంగం ద్వారానే సాంఘిక అసమానతల్ని రూపుమాపాలని అంబేద్కర్ తెలిపాడని, సోషలిజం కోసం ఆయన కలలు కన్నారన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బడుగు, బలహీన వర్గాలకు, మానవ హక్కులకు అంబెద్కర్ దిక్చూచి అంబెద్కర్ అని, ఆయన ఆలోచనా విధానాన్ని అడ్డుకునేందుకు మతోన్మాదులు కుట్ర పన్నుతున్నారన్నారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, స్త్రీలకు అంబేద్కర్ హక్కులు సాధించిపెట్టారని, ఐతే వీరికి రాజ్యాధికారం వస్తే మాటలు సాగవని మతోన్మాద భావజాలం కలిగిన వారు అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బావితరాలకు మార్గదర్శకుడైన అంబేద్కర్ ఆశయాల సాధనకోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని, ఆయన ఆశయాలకు అనుగుణగా కుల వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వాలపై పోరాడాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, జి వీరస్వామి, వాసిరెడ్డి మురళి, వట్టికొండ మల్లికార్జున్ రావు, భూక్య దస్రు, జక్కుల రాములు, భూక్య శ్రీనివాస్, ఎస్ కె ఫహీమ్, ధనలక్ష్మి, కె రత్నకుమారి, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, కిష్టాఫర్, బత్తుల సురేష్, నేరెళ్ల రమేష్, ధర్మరాజు, యూసుఫ్, బోయిన విజయ్ కుమార్, పి సత్యనారాయణాచారి, దుర్గ, బండి నర్సింహా, నూనావత్ గోవిందు, జె గట్టయ్య, మూడు గణేష్, షాహీన్, విజయలక్ష్మి, షమీమ్, ధనలక్ష్మి, మేదిని లక్ష్మి, లక్ష్మీనారాయణ, మాతంగి లింగయ్య, పి ప్రశాంత్, కృష్ణయ్య, జహీర్, దాట్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.