17-04-2025 07:00:27 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో ఐఎన్టియుసి యూనియన్ ఆధ్వర్యంలో గురువారం పిట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిట్ సెక్రటరీ రాకం అశోక్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఐఎన్టియుసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజు, ఇల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్ జె. వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీ (R) గోచికొండ సత్యనారాయణ, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ భూక్య నాగేశ్వరరావు పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా కోయగూడెంలో పనిచేస్తున్న అధికారులకు, సూపర్వైజర్లకు, కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, మహిళ ఉద్యోగస్తులకు, సింగరేణి సంస్థ 70 మిలియన్ల టన్నుల బొగ్గును సాధించినందుకు కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సింగరేణి సంస్థ పుట్టినిల్లు అయిన ఇల్లందు మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని దీనిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గత పదేళ్లగా బీఆర్ఎస్ పార్టీ సింగరేణి సంస్థను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని, కార్మిక సంక్షేమం కూడా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ఒడిస్సా రాష్ట్రంలోని నైని బొగ్గు బ్లాకులో తట్టెడు మట్టి కూడా తీయకుండా నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జనక్ ప్రసాద్, ఇతర మంత్రుల సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర కార్మిక శాఖ మంత్రి ప్రహల్లాద్ జ్యోసి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి అలాగే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి ఉత్పత్తి వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతంగా కృషిచేసి నిన్న నైని ఓపెన్ కాస్టును ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు.
ఈ నైని ఓపెన్ కాస్ట్ ద్వారా సంవత్సరానికి 10 మిలియన్ల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయని అలాగే ఈ ఓపెన్ కాస్ట్ 38 సంవత్సరాలు నిరంతరంగా నడుస్తుందని, ఈ గనిలో 380 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. అదేకాకుండా థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. కే.రాంబాబుని బ్రాంచ్ సెక్రటరీగా, జి. సమ్మయ్య అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీగా, అశోక్ ట్రిప్మన్ ను అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ, శారదని ఉమెన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, రామస్వామి పంప్ ఆపరేటర్ ని సేఫ్టీ కమిటీ మెంబర్ గా, రవిని మైన్స్ కమిటీ మెంబర్గా నియమించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామారావు, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ, బాసు గారు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, రిలే డి ఇంచార్జ్ రామకృష్ణ, షిఫ్ట్ ఇన్చార్జిలు, క్లబ్ సెక్రెటరీ, సేఫ్టీ కమిటీ సభ్యులు, మైన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.