calender_icon.png 3 March, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిద్ధం, శాస్త్రీయ విద్య సాధనకై పోరాడుదాం..

02-03-2025 08:26:14 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): నూతన విద్యా విధానంతో మనుధర్మ శాస్త్రాన్ని విద్యారంగంలో ప్రవేశ పెట్టడానికి ఈ పాలకవర్గాలు కుట్రలు చేస్తున్నాయని, నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ శాస్త్రీయ విద్యా విధానానికై పోరాడాలని పౌర హక్కుల సంఘం(CLC) ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎస్ ఉపేందర్ రావు, ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజులు పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలోని రైటర్ బస్తి ఐఎఫ్టియు కార్యాలయం (జంపాల నగర్) నందు పిడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిర్మాణ జనరల్ బాడీ జిల్లా అధ్యక్షుడు బి.శ్యామ్ అధ్యక్షతన జరిగింది. 

ఈ జనరల్ బాడీలో వారు ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగిస్తూ ఈ సమాజంలో శ్రమదోపిడి, దోపిడి ఎలా చేయాలో ఈ విద్యా విధానం నేర్పిస్తుందని వాస్తవంగా శాస్త్రీయబద్ధంగా ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో ఈ విద్యా విధానం నేర్పించడం లేదన్నారు. నూతన విద్యా విధానం పేరుతోటి నేడు జ్యోతిష శాస్త్రాలని, మనుధర్మ శాస్త్రాలని తీసుకువచ్చి కాబోయే భావిభారత పౌరుల మెదళ్లను తుంచి వేస్తున్నారని, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యా విధానాన్ని నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం తన చెప్పు చేతుల్లోకి తీసుకొని N.E.P2020, యుజిసి నూతన నిబంధనల పేరుతో యూనివర్సిటీల  స్వయం ప్రతిపత్తిని లాగేసుకుంటుందని, విద్యార్థుల మెదళ్లను ప్రశ్నించే తత్వాన్ని తుంచివేయడమే నూతన విద్యా విధానంలో మార్పు అని వారి హెద్దేవా చేశారు. బడ్జెట్లో విద్యా రంగానికి నిధులు కేటాయించని వారన్నారు.

బొగ్గు బావులకు, BPL, BTPS, KTPS, భారజల కర్మాగారంలకు నెలవుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీని నెలకొల్పాలని, ఆదివాసి, పేద విద్యార్థుల కోసం గిరిజన యూనివర్సిటీనీ ఏర్పాటు చెయ్యాలని అనేకసార్లు పిడిఎస్యు ఆందోళన చేసిన పట్టించుకోవడంలేదని వారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 420 హామీలలో విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తామన్న హామీని నెరవేర్చుకోవాలని మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశంలో అది నిరూపించుకోవాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వాలని, పర్మినెంట్ లెక్చరర్ పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేయాలని వారు అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులంతా ఉద్యమించాలని వారు అన్నారు. 

ఈ నిర్మాణ జనరల్ బాడీకి ముందు పిడిఎస్యు జెండాను జిల్లా అధ్యక్షుడు శ్యామ్ ఎగరవేయగా పిడిఎస్యు అమరవీరుల సంతాప తీర్మానాన్ని రాష్ట్ర సహాయ కార్యదర్శి డి ప్రణయ్ కుమార్ ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు పిఓఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్, పిడిఎస్యు జిల్లా నాయకులు పి, వెంకటేష్, రామ్ చరణ్, రఘు, జస్వంత్ కిరణ్ సుమంత్ అశోక్ మనస్వి రాగిణి అంజాం తదితరులు పాల్గొన్నారు.