07-04-2025 01:21:35 AM
హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): తెలంగాణ నీటిప్రయోజనాలే తమకు అన్నింటికన్నా మిన్న అని..రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన నదీజలాలను వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అంతర్‌రాష్ర్ట జల వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు.
కృష్ణా జలాశయాలలో తెలంగాణకు జరుగుతున్న అన్యా యంపై కృష్ణా ట్రిబ్యునల్ 2 ఎదుట రాష్ట్రం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల బృందానికి రాష్ర్ట ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు. ఆదివారం జలసౌధలో నీటిపారు దల శాఖాధికారులతో పాటు న్యాయవాదు ల ప్రతినిధుల బృందంతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇంతకు ముం దు కృష్ణా ట్రి బ్యునల్ 2 ఎ దుట జరిగిన వాదనలను పూర్తిగా సమీక్షించడంతోపా టు ఏప్రిల్ 15, 16 తేదీల్లో ట్రి బ్యునల్ ముందు లెవనెత్తాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించి ముందస్తు వ్యూహాన్ని రూపొందించుకున్నారు. 2014లో రాష్ట్ర పునర్విభజన అనం తరం కృష్ణా జలాశయాలలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నీటి కేటాయింపులు వంటి అంశాలను వెల్లడించారు.
న్యాయబద్ధంగా రావాల్సిన నీటి కేటాయింపులపై బలమైన వాదనలు వినిపించాలని మంత్రి మార్గదర్శనం చేశారు. తెలంగాణకు జరుగుతున్న నీటి దోపిడీని అరికట్టేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సా రించిందని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు వివిధ న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసులు, అప్పీల్స్ ప్రస్తుత స్థితి ని ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందిం చాల ని అధికారులను ఆదేశించారు.
రాష్ర్ట నీటిపారుదల సలహాదారు ఆదిత్యానాథ్‌దాస్, ఈఎన్‌సీలు అనిల్‌కుమార్, విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది సీఎస్ వై ద్యనా థన్ తదితరులు సమీక్షలో ఉన్నారు.