calender_icon.png 26 April, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజతోత్సవ సభ బహిరంగ సభకు కదలి వెళ్దాం

26-04-2025 04:50:23 PM

భద్రాచలం పట్టణం నుంచి వందలాదిగా తరలిరావాలి..

బిఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్..

భద్రాచలం (విజయక్రాంతి): 25 సంవత్సరాల బిఆర్ఎస్ రజతోత్సవ సభను భద్రాచలం మండలం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ అన్నారు. శనివారం భద్రాచలంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. భద్రాచలం మండలం నుండి 40 కార్ల ద్వారా జన సమీకరణ జరుగుతుందని.. పార్టీ అభిమానులు కార్యకర్తలు వివిధ వార్డుల నుండి అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో మండల పార్టీ కో కన్వీనర్ రేపాక పూర్ణచందర్రావు, సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమ్ కుమార్, మహిళా నాయకురాలు సీతా మహాలక్ష్మి, యువజన నాయకుడు మురలా డానియల్ ప్రదీప్, కార్మిక విభాగం నాయకులు చిట్టిమల్ల అనిల్ కుమార్ ఉన్నారు.