calender_icon.png 16 April, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సైనికులై కదం తొక్కాలి

14-04-2025 05:43:20 PM

ఖానాపూర్ టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్

ఖానాపూర్ (విజయక్రాంతి): కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తెలంగాణ సైనికులై కదం తొక్కాలని, బీఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ఈనెల 27న జరిగే చలో వరంగల్ కార్యక్రమ పోస్టర్ లను ఖానాపూర్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ పార్టీ కార్యకర్తల కోసం దిశా నిర్దేశం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ గెలుపు మేరకు ప్రతి ఒక్కరు తెలంగాణ రక్షణ కొరకు కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి రాజ గంగన్న, పట్టణ అధ్యక్షులు గౌరీకర్ రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ ,పుప్పాల గజేందర్, ప్రశాంత్ రెడ్డి, నసీర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.