08-02-2025 04:57:02 PM
వైద్యాధికారి మధు..
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకపోవడం మండలం గిరిజన ఆరోగ్య కేంద్రంలో శనివారం జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి కే మధు మాట్లాడుతూ... నులిపురుగుల నివారణకు ఆల్బెండజాల్ టాబ్లెట్లను వినియోగించాలన్నారు. ఒక సంవత్సరం చిన్నారి నుంచి 2 సంవత్సరాల వయసు కలిగిన వారందరూ నూలి పురుగుల నివారణకు సగం టాబ్లెట్ రెండు సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు కల వారందరూ పూర్తి టాబ్లెట్ను వేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మండల స్థాయి టాస్క్ ఫోర్స్ మీటింగు ఏర్పాటు చేశారు.
ఈ టాబ్లెట్లు వాడి నులిపురుగులను బాధనుండి విముక్తి పొందుతే రక్తహీనత నుంచి పిల్లలు బయటపడి చురుకుగా ఉండే అవకాశం ఉందన్నారు. దీంతో పాటు జ్ఞాపకశక్తి బాగా పనిచేస్తుందని ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. మండలానికి 2,764 మంది పిల్లల లక్ష్యాన్ని నిర్ణయించారని, వైద్య సిబ్బంది లక్ష్యానికి అనుగుణంగా చిన్నారులచే మాత్రలు మింగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవితేజ, హెచ్ఈఓ పోలబోయిన కృష్ణయ్య, సిబ్బంది భవాని, రమాదేవి, లక్ష్మి, విద్యా, వెంకటరమణ, సునీల్, పరమేశ్వరి, విమలమ్మ తదితరులు పాల్గొన్నారు.