21-02-2025 06:47:10 PM
నిర్మల్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా సిపిఐ ఎంఎల్ న్యూ మాస్ ఆధ్వర్యంలో ఈనెల 28 చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రాజన్న తెలిపారు. శుక్రవారం చలో ఢిల్లీ కరపత్రాలను విడుదల చేశారు. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని వారు పేర్కొన్నారు. మతోన్మాదం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని దాన్ని వెంటనే విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మి గంగన్న కపూర్ నారాయణ సుజాత రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.