హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): గ్రామీణ యువ క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో సీఎం కప్- 2024ను విజయవంతం చేయాలని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో క్రీడా సంఘాల ప్రతినిధులతో శివసేనా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నాలుగు అంచెల్లో గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కప్ నిర్వహణలో పారా క్రీడాంశాలకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని పేర్కొ న్నారు. దశలవారీగా క్రీడారంగాభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని సీఎం పట్టుదలతో ఉన్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్, ఎండీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.