26-04-2025 05:02:01 PM
మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు..
పాల్వంచ (విజయక్రాంతి): బిఆర్ఎస్ 25 ఏళ్ల పండుగను వందేళ్లు గుర్తుండేలాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతుందని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ రజతోత్సవ సభకు కొత్తగూడెం నియోజకవర్గం నుండి వేలాదిమంది ఉప్పెనల తరలిరావాలని, వరంగల్ బహిరంగ సభ కనీ విని ఎరుగని రీతిలో జరగబోతుందన్నారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలన ఒక స్వర్ణ యుగం, కేసీఆర్ ఒక కారణజన్ముడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలాగా వరంగల్ సభ కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఆరు గ్యారెంటీల మాయమాటలతో ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ దన్నారు.
ఆదివారం ఉదయం నియోజకవర్గ నుంచి వేలాది మంది ఇల్లందు క్రాస్ రోడ్ నుండి బస్సులో,ఇతర వాహనాలలో తరలి వెళ్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేందర్ రావు, సీనియర్ జిల్లా నాయకులు కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనికేష్,మాజీ ఎంపీపీ మడివి సరస్వతి, జిల్లా బిఆర్ఎస్ నాయకులు దాసరి నాగేశ్వరరావు, మల్లెల శ్రీరామ్ మూర్తి, కొత్వాల సత్యం, భూక్య చందు నాయక్, వీరు నాయక్, తెలంగాణ సురేష్ తదితరులు పాల్గొన్నారు.