calender_icon.png 16 March, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిలియన్ మార్చ్ డే ను జయప్రదం చేద్దాం..

05-03-2025 06:27:37 PM

టీయూజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి.. 

రామాయంపేట్ (విజయక్రాంతి): గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డే ను జయప్రదం చేయాలని టియుజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని రామాయంపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ... 2011 మార్చి 10న సీమాంద్ర దోపిడీ పాలనపై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు జెండా ఎత్తిన రోజని, తెలంగాణ ప్రజలు తెగించి తెగువతో పోరాడారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ అకాంక్షలను, ఉద్యమకారుల గోడును మాజీ సీఎం కేసిఆర్ విస్మరించి తెలంగాణను విధ్వంసం చేశాడని మండిపడ్డారు.

టియుజేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 250 గజాల ఇంటి స్థలం, రూ.30,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి పి ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పి రమేష్ గౌడ్, ఉద్యమకారుల జెఎసి ఎర్ర దుర్గం పంబాల శ్రీనివాస్, జేఏసీ రాష్ట్ర నాయకులు తుల్జ రెడ్డి, లక్ష్మి కాంతమ్మ, పి లక్మీ, అన్వర్ పటేల్, టియూకేవి అధ్యక్ష, కార్యదర్శులు పెద్ద యాదగిరి, డోలక్ యాదగిరి, గంగారాం, పి శ్రీనివాస్, నర్సగల్ల పెద్దస్వామి, చర్చల చంద్రన్న ప్రసాద్, కొమ్ము శంకర్, తాళ్లపల్లి ఎల్లం, కె రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.