calender_icon.png 1 February, 2025 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మాగాంధీ కలలను సాకారం చేద్దాం

31-01-2025 01:25:08 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్ జనవరి 30 :-  భారతదేశ స్వాతంత్రం కోసం  శాంతియుతంగా ఎన్నో సత్యాగ్రహాలు, పోరాటాలు చేసి స్వాతంత్య్రా న్ని సాధించి పెట్టిన పూజ్య బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఉదయం ఐ.డి.ఒ.సి సమావేశ మందిరంలో జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు తో కలిసి  మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలతో ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం కలక్టర్ మాట్లాడుతూ బాపూజీ కుష్టు వ్యాధి గ్రస్తుల పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపించే వారని, కుష్టు వ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది కానీ ఇది ఒకరి నుండి ఒకరికి సంక్రమించదని వారి పట్ల సమాజంలో ప్రేమ అభిమానం చూ పించాలని  బాపూజీ ప్రచారం చేసి వారికి ఆశ్రయం కల్పించారన్నారు.

అందుకే మహా త్మా గాంధీ  వర్ధంతి రోజున జాతీయ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవంగా సైతం పాటి స్తామని తెలియజేశారు. మహాత్మగాంధీ కల లు కన్న విధంగా, సమీప భవిష్యత్తులో కుష్టు వ్యాధి రహిత భారతదేశ నిర్మాణములో అందరితో కలిసి కషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తు న్నానని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్ర మంలో జిల్లా అధికారులు, కార్యాలయాల   సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.