'తండేల్’ జాతర ఈవెంట్ లో హీరో అక్కినేని నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఆదివారం రాత్రి మేకర్స్ హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ‘తండేల్ జాతర' పేరుతో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. 'అల్లు అరవింద్, వాసు లేకుండా నెక్స్ట్ సినిమా ఎలా ఫినిష్ చెస్తాననే భయం పట్టుకుంది. వారు సినిమాలో అంతలా కాంట్రిబ్యుట్ చేస్తారు. గీత ఆర్ట్స్ పేరు నా కెరీర్ లో టాప్ లో ఉంటుంది.
తండేల్ నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ. తండేల్ రాజుకి నాకు రియల్ లైఫ్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ నేను చేయగలనని నమ్మిన వాసు, చందుకి థాంక్ యూ. క్యారెక్టర్ లోకి ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వడానికి చాలా టైమ్ ఇచ్చారు. చందుతో ఇది మూడో సినిమా. నన్ను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తాడు.
సాయిపల్లవి అద్భుతమైన నటి. తనని అందరూ ఇష్టపడతారు. తను చాలా పాజిటివ్ పర్సన్. శ్రీకాకుళం నుంచి వచ్చిన మత్స్యకారుల కుటుంబాలకు ధన్యవాదాలు. వారి వల్లే నా క్యారెక్టర్ కి ఒక ఐడియా వచ్చింది. వారికి సముద్రం తప్పితే మరొకటి తెలీదు. వారు లేకపోతే ఈ సినిమా లేదు. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఫిబ్రవరి 7 థియేటర్లలో దుల్లకొట్టేద్దాం' అన్నారు.
హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ.. 'దేవిశ్రీ ప్రసాద్ అదద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన డ్యాన్స్ చేస్తూనే సాంగ్స్ కంపోజ్ చేస్తారు. అందుకే పాటల్లో అంత ఎనర్జీ ఉంటుంది. ఇందులో బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. శ్యామ్ దత్ ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. నాగేంద్ర ప్రతి సెట్ కీ లైఫ్ తీసుకొచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరున థాంక్స్. అల్లు అరవింద్ నాకు తండ్రిలాంటి వారు. బన్నీవాసు చాలా పాషన్ తో సినిమాని చేశారు. వారి నిర్మాణంలో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
సందీప్ రెడ్డి వంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు. ఫిలిం మేకర్ కి ఆ వాయిస్ ఉండాలి. చైతన్య ఈ సినిమా కోసం చాలా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ఈ సినిమా కోసం ఆయనలో ఓ ఆకలి కనిపించింది. చాలా హార్డ్ వర్క్ చేశారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన అందరికీ థాంక్ యూ. మేము మీ సినిమానే తీశాం. చాలా మంచి సినిమా ఇది. మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను' అన్నారు.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘తండేల్ ట్రైలర్ టీజర్ సాంగ్స్ ఏది చూసినా సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తోంది. సాయిపల్లవి, చైతన్య కెమిస్ట్రీ చాలా రియల్ గా అనిపిస్తోంది. కేడీ సినిమాకి వర్క్ చేసినప్పుడు చైతన్య సెట్స్ కి వచ్చేవారు. అప్పుడే ఆయన నాకు చాలా నచ్చారు. ఆయన బయట వేసుకునే కాస్ట్యుమ్స్ నా సినిమాలకి రిఫరెన్స్ గా చూపిస్తాను. దేవిశ్రీ సర్ మ్యూజిక్ కి హ్యాట్సప్. ప్రేమమ్ సినిమా నుంచి సాయిపల్లవి నటన అంటే ఇష్టం. తను అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నారు.
చందు నాకు ఆరేళ్లుగా తెలుసు. ఈ కథ నాకు తెలుసు. అక్కినేని ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంటుంది. సూపర్ హిట్ ఫిల్మ్ అనే ఫీలింగ్ ఉంది. చైతన్య మజిలీ సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చాను. అది పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'ఫిబ్రవరి 7 థియేటర్స్ లో దుల్లకొట్టేద్దాం.. మీరంతా రావాలి. చాలా కాన్ఫిడెన్స్ చెబుతున్నా, సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడతాను' అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. 'చందు సినిమాని అద్భుతంగా తీశారు. వాసు సినిమాని చాలా ఉన్నతంగా నిర్మించారు. చైతన్య ట్రాన్స్ఫర్ మేషన్ చాలా ఫెంటాస్టిక్ వుంది. ఇది ఆయన కెరీర్ చాలా డిఫరెంట్ మూవీ. సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ అమేజింగ్. వీరి కెమిస్ట్రీ అద్భుతంగా వుంటుంది. టెక్నిషియన్స్ అందరూ వండర్ ఫుల్ గా వర్క్ చేశారు. అందుకే బీజీఎం ఇంత గొప్పగా వచ్చింది. లిరిక్ రైటర్స్ శ్రీమణి, జొన్న విత్తుల, సింగర్స్ కి థాంక్ యూ' అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'మంచి కథ. ఆ కథని ప్రేక్షకులు దగ్గరికి తీసుకెళ్లే దర్శకుడు చందు. మంచి టీమ్. బన్నీ వాసు లాంటి మంచి నిర్మాత. ఆయన వెనుక అల్లు అరవింద్ సపోర్ట్. సాయిపల్లవి పాజిటివ్ ఎనర్జీ. చైతన్య కథని క్యారెక్టర్ ని పట్టుకొని కష్టపడ్డారు. ఇంతమంది కష్టపడిన తర్వాత సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. జనవరిలో మేము కొట్టాం. ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్' అన్నారు.
నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. 'దిల్ రాజు, సందీప్ లాంటి పాజిటివ్ సక్సెస్ ఫుల్ పీపుల్ ఈవెంట్ కి విష్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా యూనిట్ అందరికీ థాంక్ యూ. దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికీ మూడు సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరో సాంగ్ రాబోతోంది. డైరెక్టర్ చందు చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. నా ఫస్ట్ సినిమా చైతన్యతో స్టార్ట్ చేశాను. నా హయ్యస్ట్ బడ్జెట్ సినిమా ఆయన చేయడం చాలా ఆనందంగా వుంది.
ఈ సినిమా చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఈ సినిమా ఆయనకి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. సినిమా చూసి ఆయన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. సాయిపల్లవి మెస్మరైజింగ్ యాక్టర్' అన్నారు. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, కో ప్రొడ్యూసర్లు భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, ఆర్ట్ డైరెక్టర్ నాగ్రేంద్ర, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, లిరిక్ రైటర్లు శ్రీమణి, జొన్నవిత్తుల, యాక్టర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.