16-03-2025 12:29:48 AM
ఎండాకాలంలో చాలామంది ముఖం జిడ్డుగా మారుతుంది. అలాంటివారు బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. అలాగే ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. ఎర్ర మాంసం, పాలతో చేసిన ఉత్పత్తలు, చక్కెర పానీయాలను కూడా తక్కువగా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
* జిడ్డు ముఖం ఉన్నవారు ముఖ్యంగా దుమ్ము, సూర్య కాంతి నుంచి ముఖాన్ని రక్షించుకోవాలి. రోజుకు నాలుగు, ఐదు సార్లు మంచి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ముఖం జిడ్డుగా ఉందని ఎక్కువగా ఫేస్ వాష్ క్రీంలను వాడటం ఏ మాత్రం మంచిది కాదు. కొన్ని ఇంటిలోనే తయారుచేసుకునే ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తే ముఖంపై ఉండే జిడ్డు తగ్గిపోయి ఫేస్ అందంగా, ఆకర్షణీయంగా, మృదువుగా కనిపిస్తుంది.
* జిడ్డు సమస్యను తగ్గించడానికి రోజ్ వాటర్ మంచిగా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్‌లో యాంటీ మైక్రోబయాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. రోజ్ వాటర్‌లో కాటన్ బాల్స్‌ను ముంచి వీటితో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే ఫేస్‌పై ఉన్న జిడ్డు తగ్గిపోతుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల చర్మం అందంగా, మృదువుగా కనిపిస్తుంది.