calender_icon.png 26 January, 2025 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వదల బొమ్మాళీ వదల!

16-07-2024 01:10:02 AM

తెలంగాణలో రైతు రుణమాఫీ అమలు చేసేందుకు వాయిదాలు వేస్తూ వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15ను డెడ్‌లైన్‌గా ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంద్రాగస్టు నాటికి రుణమాఫీని అమలు చేయకపోతే పెద్ద ఉద్యమం చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ అంశంపై ఆ పార్టీ అంతర్గతంగా సమీక్షలు సైతం చేసినట్టు సమాచారం. అందుకే క్రమం తప్పకుండా ఈ అంశంపై పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడుతున్నారు. ఆగస్టు 15 తర్వాత రాష్ట్రంలో యుద్ధం జరగబోతోందని బీజేపీకి చెందిన ఓ ముఖ్య నేత పేర్కొనడం చూస్తే రుణమాఫీ అమలు చేయకుంటే కాంగ్రెస్ సర్కారు పరిస్థితి ఏంటో అనే చర్చ జరుగుతోంది.