05-04-2025 07:50:05 PM
మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య..
కాటారం (విజయక్రాంతి): సామాజిక సమానత్వం కోసం పోరాడుదామని, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దామని మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం ఆదర్శ నగర్ కాలనీలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ... దేశ స్వతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడుదామని, ఆ లక్ష్యంతో పోరాడిన ఆదర్శ నేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దామని అన్నారు.
దేశానికీ అయన చేసిన సేవలు నిరుపమానమని, అయన చేపట్టిన పదవులకు వన్నె తెచ్చారని, దళితుల అభ్యున్నతి కోసం జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. యువత జగ్జీవన్ రామ్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలని, ఆయన ఆశయం కోసం పని చేయాలనీ మాజీ ఎంపీపీ సమ్మయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, ఆదర్శ నగర్ కాలనీ కన్వీనర్ ఆత్మకూరి కుమార్ యాదవ్, హట్కర్ రమేష్ నాయక్, గడ్డం కొమురయ్య యాదవ్, పంతకాని మల్లికార్జున్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మంత్రి మధు, పందిర్ల రాజన్న, దుర్గ రావు, చిర్ల ఎల్లా రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.