06-04-2025 07:18:28 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): బిటి రణదివే స్పూర్తితో సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం పోరాటాలకు కార్మికులు సన్నద్ధం కావాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న అన్నారు. ఇంద్రవెల్లి మండలం ధనోర (బి) గ్రామ పంచాయతీలో స్వాతంత్ర సమర యోధుడు, సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదివే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.