calender_icon.png 25 March, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగత్ సింగ్ స్పూర్తితో మతోన్మాదంపై పోరాడుదాం

23-03-2025 04:56:32 PM

సిపిఐ(ఎం) నేతలు పోతినేని సుదర్శన్ రావు, నున్నా నాగేశ్వరరావు..

94వ వర్ధంతి సందర్భంగా వైరాలో భారీ బైక్ ర్యాలీ..

వైరా (విజయక్రాంతి): జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం, మేం మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం.. ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పురవ్వల మీద నిదురిస్తాం అంటూ దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులపై తిరుగుబాటు చేసి 23 ఏళ్ల అతి పిన్న వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ స్ఫూర్తితో మతోన్మాదంపై పోరాడుతామని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. సిపిఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురుల 94వ‌ వర్ధంతి సందర్భంగా ఆదివారం వైరా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం పార్టీ వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు అద్యక్షతన స్థానిక రింగ్ రోడ్డు సెంటర్ వద్ద జరిగిన వర్ధంతి సభలో పోతినేని సుదర్శన్ రావు, నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ... "నన్ను చంపవచ్చు, కాని నా ఆలోచనలను చంపలేరు", "నా రక్తం వృథా కాదు, నా మృత్యువు వృథా కాదు, నా నెత్తురు కోనేరులో నవలోకం వికసిస్తుంది" అంటూ రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యువ కెరటం భగత్‌సింగ్‌ దేశమాత విముక్తి కోసం విజయమో వీర మరణమో అంటూ స్వాతంత్య్ర ఉద్యమంలో రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. వారు ఇచ్చిన ఇంక్వీలాబ్ జిందాబాద్ నినాదం నేడు ప్రవాహంలా మారి నేటి తరాలకు చేరిందని అన్నారు. భగత్ సింగ్ భారతీయ సమాజంలో పెరుగుతున్న మతతత్వ స్వభావాన్ని విమర్శించిన నాస్తికవాదని, లౌకికతత్వం, సోషలిజం కోసం పోరాడుతున్న నేటి తరానికి భగత్ సింగ్ గొప్ప స్ఫూర్తి అని, కుల, మత తత్వాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలకు యువత కలిసి రావాలని కోరారు.

అనంతరం పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంతో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, కొణిజర్ల, వైరా మండలాల కార్యదర్శులు చెరుకుమల్లి కుటుంబరావు, బాణాల శ్రీనివాసరావు, డివిజన్ నాయకులు మచ్చా మణి, తోట నాగేశ్వరావు, పారుపల్లి కృష్ణారావు, తూము సుధాకర్, గుడిమెట్ల రజిత, మాగంటి తిరుమలరావు, దొడ్డపనేని కృష్ణార్జునరావు, బోయినపల్లి శ్రీనివాసరావు, కొంగర సుధాకర్, చింతనిప్పు నరసింహారావు, అనుమోలు రామారావు, గుడిమెట్ల మోహనరావు, హరి వెంకటేశ్వరావు, మల్లేంపాటి రామారావు, బాజోజు రమణ, కిలారు శ్రీనివాసరావు, కామినేని రవి, గుమ్మా నరసింహారావు, రాచబంటి భత్తిరన్న, షేక్ నాగుల్ పాషా, మోత్కూరు వెంకటేశ్వరరావు, మేడా శరభంది, కారుమంచి జయరాజు, పారుపల్లి శ్రీనాథ్ బాబు, కురుగుంట్ల శ్రీనివాసరావు, షేక్.మజీద్ బి, షేక్.షైనాబీ, షేక్.రేహణ తదితరులు పాల్గొన్నారు.