లౌకిక వామపక్ష శక్తులను ఐక్యం చేద్దాం..
సరళికృత ఆర్థిక విధానాలు వ్యతిరేకంగా పోరాడుదాం..
నూతన కార్యదర్శి గా జాన్ వేస్లీ ఎన్నిక..
ముగిసిన సీపీఎం రాష్ట్ర మహాసభలు..
సంగారెడ్డి (విజయక్రాంతి): సిపిఐ(ఎం) రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి పట్టణంలో ఈ నెల 25 నుండి 28 వరకు నిర్వహించారు. మంగళవారం మహాసభలో రాష్ట్ర నూతన కార్యదర్శి ఎన్నిక చేసి ముగించారు. ఈ మహాసభలో రాష్ట్రంలో ప్రజలు ఎదురుకుంటున్న పలు సమస్యలపైన తీర్మానాలు చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనీ, రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం పోరాడాలని, మతోన్మాదము వ్యతిరేకంగా సామజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించారు. మహాసభలో 60 మందితో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి గా జాన్ వేస్లీ ఎన్నుకోవడం జరిగింది.